క్లాస్‌రూమ్ డైరెక్ట్‌గా బోధిస్తున్నప్పుడు ఆన్‌లైన్‌తో పనేంటి ?
నిర్ణీత ఫీజుతోనే ఒక తరగతిలోని అన్ని పరీక్షలతో పాటు అన్ని సౌకర్యాలు అందించాలి. కానీ శ్రీచైతన్య బుక్స్‌కి ఎక్స్‌ట్రా, డ్రస్‌కి ఎక్స్‌ట్రా, ఒలింపియాడ్స్‌కి ఎక్స్‌ట్రా, ఇన్ఫినిటీ మెటా జానియర్ యాప్‌కి ఎక్స్‌ట్రా.. ఇలా తల్లిదండ్రుల్ని వివిధ రకాల ఫీజుల పేరుతో స్కూల్ ఫీజు కన్నా ఎక్కువగా దోచుకుంటోంది శ్రీచైతన్య. శ్రీచైతన్యలో చదువుతున్న వారికి మళ్ళీ ప్రత్యేకంగా యాప్ అవసరం లేదు. డైరెక్ట్‌గా అన్నీ శిక్షణలో భాగంగా అందించవలసి ఉంటుంది. యాప్ అవసరం ఉందీ అంటే డైరెక్ట్‌గా శ్రీచైతన్యలో యాప్ వాడకుండా టీచింగ్ అందించలేకపోతున్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. శ్రీచైతన్య దోపిడీకి అలవాటు పడిరది అని ఈ విషయం చెప్పకనే చెబుతోంది. ఇన్ఫినిటీ మెటా జానియర్ యాప్ వలన ఏమైనా ఉపయోగం ఉందా అంటే అదీ లేదు. కనీసం యాప్‌ని ఓపెన్ చేయని వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అదే విధంగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పదే పదే ఒక సొసైటీకి సంబంధించిన ర్యాంకులను తనవిగా ప్రకటించుకుని యాప్‌ని మార్కెటింగ్ చేసుకుంటోంది. అసలు ఇన్షినిటీ లెర్న్ లో ప్రత్యేకంగా లెక్చరర్లు లేరనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. స్టాఫ్ అంతా శ్రీచైతన్యలో పనిచేసే వారినే నాలెడ్జహబ్ మరియు ఇన్ఫినిటీ లెర్న్ వంటి సంస్థలు వాడుకుంటూ లెక్చరర్లను ముప్పుతిప్పలు పెట్టటంతో పాటు తీవ్రమైన ఒత్తిడి గురి చేస్తున్నారని లెక్చరర్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీచైతన్యకు దోపిడీ మీద ఉన్న శ్రద్ధ పిల్లలపై లేదు. శ్రీచైతన్యలో చేరిన ప్రతీ విద్యార్థికి 100 లోపు ర్యాంకు ఎందుకు రాదు ? అంటే మాత్రం సమాధానం ఉండదు.
ఫీజులన్నీ ర్యాంక్‌గురు టెక్నాలజీస్ ప్రై.లి. లోకి తరలింపు !
ఈ ఫీజులన్నీ శ్రీచైతన్య అనుబంధ సంస్థ అయిన ర్యాంక్‌గురు టెక్నాలజీస్ ప్రై.లి.సంస్థకి తరలిస్తోంది. ఇక ఈ ఫీజుని నెక్ట్‌జెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద వసూలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య స్కూల్స్ మరియు కాలేజ్‌లలో చదివే 6 లక్షల మంది దగ్గర నుండి ఇన్ఫినిటీ మెటా జూనియర్ యాప్ పేరుతో స్కూల్ పిల్లల దగ్గర రూ. 2000/` ఇన్ఫినిటీ లెర్న్ యాప్ పేరుతో కాలేజీ విద్యార్థుల దగ్గర రూ. 3000/` గుంజుకుంటోంది. రూ. సరాసరిన రూ. 2500/` వసూలు చేసినా కోటానుకోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. ఈ నిధులన్నీ నెక్ట్‌జన్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి శ్రీచైతన్య యాజమాన్యం ఆధ్వర్యంలోని ర్యాంక్‌గురు టెక్నాలజీ సొల్యుషన్స్ ప్రై.లి. కంపెనీలోకి మళ్ళిస్తోంది. విద్య ఏ రూపంలో ఉన్నా సేవ క్రిందే వస్తుంది కానీ సొసైటీల పేరుతో వసూలు చేయటం, శ్రీచైతన్య షెల్ కంపెనీలైన ప్రై.లిమిటెడ్ కంపెనీల్లో కి మళ్ళించటం వాటిని సొంతానికి వాడుకోవటంలో శ్రీచైతన్య ఆరితేరిపోతుంది. అసలు ఈ యాప్‌ని వినియోగించుకునే వారి సంఖ్య అత్యల్పం. దీని వలన ప్రయోజనం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పుస్తకాలతో పాటు యాప్‌కి కూడా డబ్బు కడితేనే పుస్తకాలు ఇస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ దోపిడీని అడ్డుకోవలసినదిగా ప్రభుత్వాలను కోరుతున్నారు. పైకి ఇన్ఫినిటీ మెటా జూనియర్ యాప్ ఉచితం అని చెప్తూనే డబ్బుల చెల్లించిన శ్రీచైతన్య విద్యార్థులకు మాత్రమే యాక్సిస్ కల్పిస్తోంది. ఇందులో డబ్బులు దండుకునే దురుద్ధేశ్యమే కన్పిస్తోంది. ఇంతటిలో ఆగలేదు శ్రీచైతన్య, స్కోరు పేరుతో రూ. 1000 కోట్లు విలువైన బోగస్ స్కాలర్‌షిప్‌ను నిర్వహిస్తోంది. పరీక్షల అనంతరం అర్హత సాధించిన వారి వివరాలు ప్రకటించలేదు. శ్రీచైతన్యలో చేరే విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌షిప్ వర్తిస్తుంది అని షరతులతో మోసగిస్తోంది. ఈ స్కోర్ ఎగ్జామ్‌ని ర్యాంక్‌గురు టెక్నాలజీస్ ప్రై.లి. నిర్వహించటం గమనార్హం.
శ్రీచైతన్య స్టూడెంట్సే ఇన్ఫినిటీలెర్న్‌కి మూలధనం !
ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీ చైతన్య, భారతదేశం యొక్క ఏకైక ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్. ఎడ్‌టెక్ పరిశ్రమలో అత్యంత వేగవంతమైన అభివృద్ధి కనబరచిన స్టార్టప్‌గా తనను తాను ప్రకటించుకుంది. 2021-22లో కేవలం 2.3 కోట్లతో పోలిస్తే 2022-23లో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 100 కోట్లకు చేరుకుంది. మార్చి 31, 2023తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 100 కోట్లు ప్రకటించింది. 2023`24 ఆర్థిక సంవత్సరానికి ఎంత లాభం ప్రకటిస్తుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం, ఇన్ఫినిటీ లెర్న్ దాని ప్లాట్‌ఫారమ్‌లో 7.5 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది మరియు 7.5 మిలియన్ల మంది అభ్యాసకులు ఏదో ఒక రూపంలో కంటెంట్‌ను యాక్సెస్ చేస్తున్నారు. 2025 నాటికి తన ప్లాట్‌ఫారమ్‌లో 50 మిలియన్ల అభ్యాసకులను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇన్ఫినిటీ మెటా జూనియర్ యాప్ పేరుతో శ్రీచైతన్య స్కూల్ పిల్లల దగ్గర రూ. 2000/` ఇన్ఫినిటీ లెర్న్ యాప్ పేరుతో శ్రీచైతన్య కాలేజీ విద్యార్థుల దగ్గర రూ. 3000/` ఆన్‌లైన్ యాప్‌ల పేరుతో విద్యార్థుల దగ్గర నుండి బలవంతంగా వసూలు చేస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్రీచైతన్యలో చదువుతున్నప్పుడు యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. శ్రీచైతన్య దోపిడీని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక్క సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌ల కోసం, పరీక్ష పేపర్ల కోసం తప్పించి ఇతర తరగతుల వారికి ఉపయోగం లేదని వాపోతున్నారు. జైజూస్ తరహాలోనే ఆన్‌లైన్ కంటెంట్ అందించే ఇన్ఫినిటీ లెర్న్..కేవలం శ్రీచైతన్య విద్యార్థులపై ఆధారపడి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఒక్క సారి తల్లిదండ్రులు ఆన్‌లైన్ యాప్‌లకు ఫీజలు ఎందుకు కట్టాలి అని ఎదురుతిరిగితే ఇన్ఫినిటీ లెర్న్ (ర్యాంక్‌గురు టెక్నాలజీస్ ప్రై.లి) మూసుకోవాల్సిందే.
0 Comments