Ticker

6/recent/ticker-posts

Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !

  • స్కూల్స్‌కి ఒక సొసైటీ, కాలేజీకి ఒక సొసైటీ, అకాడమీలకు ఒక సొసైటీ, ఫేక్‌ ఒలింపియాడ్స్‌కి ఒక సొసైటీ !
  • ప్రతి రాష్ట్రానికి ఒక సొసైటీని రిజిష్టర్‌ చేసిన శ్రీచైతన్య.
  • అన్ని సొసైటీల నుండి వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లతో పాటు వివిధ ప్రై.లి. కంపెనీల్లోకి మనీ రూటింగ్‌ !
  • నష్టాల్లో సొసైటీలు...ఆ సొసైటీలకి సర్వీస్‌ అందించే ప్రై.లి. కంపెనీలు మాత్రం లాభాల్లో !
  • నిబంధనలు బేఖాతర్‌ చేస్తున్న శ్రీచైతన్య.

శ్రీ చైతన్య సొసైటీ మరియు ట్రస్టుల్లోని రోజు వారి కార్యకలాపాలు, వివిధ సేవల నిర్వహణ నిమిత్తం మరో సంస్థకు నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి కట్టబెట్టింది. దాని పేరే వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. వెరైటీ ఏమిటంటే రెండు సంస్థల నిర్వాహకులు ఒక్కరే. విచిత్రం ఏమిటంటే సొసైటీలు మాత్రం నష్టాలు మూటకట్టుకుంటున్నాయి. కానీ సొసైటీలకు సర్వీస్‌ అందించే ప్రై.లి. కంపెనీలు కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నాయి. ఇక్కడే ఉంది అసలైన కిటుకు. ఇటు ట్రస్టులు నిర్వహించేది అటు నిర్వహణ బాధ్యతల పేరుతో డబ్బు మళ్ళించేది శ్రీచైతన్య యాజమాన్యమే. ట్రస్టులు, సొసైటీల ద్వారా నిర్వహించలేని పనులన్నీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ చేస్తుంది అని జనాన్ని, ప్రభుత్వాన్ని నమ్మిస్తున్నారు. ట్రస్టుల నుండి డబ్బును తమ సొంత ప్రై.లి. కంపెనీల్లోకి బదలాయింపు కోసమే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

సొసైటీల చట్టం దుర్వినియోగం చేస్తున్న శ్రీచైతన్య !

ఇక వివరాల్లోకి వెళితే శ్రీచైతన్య విద్యాసంస్థల మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలోనే ‘వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. శ్రీచైతన్య హైస్కూల్‌, శ్రీచైతన్య స్కూల్స్‌, టెక్నో కరిక్యులమ్‌, శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీలు, శ్రీచైతన్య ఐఐటి అకాడమీ, శ్రీచైతన్య నీట్‌ అకాడమీ ఇలా వందల కొద్ది బ్రాంచీలు ఏర్పాటు చేసిన శ్రీచైతన్య వీటన్నింటిని వివిధ రకాల ట్రస్ట్‌లు, సొసైటీల పేరు మీద రిజిస్టర్‌ చేసింది. శ్రీచైతన్య ఎడ్యుకేషనల్‌ సొసైటీ, శ్రీచైతన్య ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, నెక్ట్‌జన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, సిద్ధి వినాయక ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, శ్రీ కళ్యాణ చక్రవర్తి మెమోరియల్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, జి.టి. ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, ఇన్ఫినిటీ లెర్న్‌, ఐఎన్‌టీఎస్‌ఓ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఇలా దాదాపు 35కి పైగా సొసైటీలు, ట్రస్ట్‌ల పేరుతో శ్రీచైతన్య విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. ఈ సొసైటీ/ట్రస్టులు అన్నీ చాలా వరకు బినామీ పేర్లుతో నిర్వహిస్తోంది. అంతేకాకుండా ప్రతి సొసైటీలోనూ ఫ్యామిలీ మెంబర్స్‌ పేరుతో వివిధ సొసైటీ/ట్రస్ట్‌లను రిజిస్టర్‌ చేసింది. ఈ 35కి పైగా సొసైటీ/ ట్రస్ట్‌ అకౌంట్ల నుండి డబ్బును అధిక మొత్తంలో ‘వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.’ కంపెనీతో పాటు వివిధ ప్రై.లి. కంపెనీల్లోకి వివిధ రకాల సేవల పేరుతో మళ్ళిస్తోంది శ్రీచైతన్య యాజమాన్యం. అంతేకాకుండా ఆయా కుటుంబసభ్యులకు చెందిన సుమారు 22 షెల్‌ కంపెనీల్లోకి వివిధ రకాల సేవల పేరుతో మళ్ళిస్తోంది. ఈ ప్రై.లి. కంపెనీలన్నీ శ్రీచైతన్య నిర్వహించే సొసైటీ/ ట్రస్ట్‌ మీద ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ సర్వీస్‌ ఏజెన్సీలే. ఇలా మళ్ళించటం ఆర్‌.టి.ఈ. యాక్ట్‌ 2019,  కంపెనీస్‌ యాక్ట్‌ 2013 సెక్షన్‌ 8 ప్రకారం ఇది నేరం. సొసైటీల చట్టాలను దుర్వినియోగ పరచటమే. అసలు స్కూల్‌/ కాలేజీ నిర్వహణ అనేది సామాజిక సేవ మరియు నాన్‌ ప్రాఫిటబుల్‌ ఆర్గనైజేషన్‌. కానీ కోట్లాది రూపాయలను తమ సొంత షెల్‌ కంపెనీలోకి డబ్బును పంపుతూ బ్లాక్‌మనీని వైట్‌ మనీగా చెలామణి చేస్తోంది. సొసైటీ / ట్రస్ట్‌ల చట్టాలను తుంగలో తొక్కి సొసైటీ/ ట్రస్ట్‌ల్లోని డబ్బును సొంత అవసరాలకు వాడుకునేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తోంది. ట్రస్ట్‌లు మరియు సొసైటీ ద్వారానే జరగాల్సిన చెల్లింపులను ప్రక్కకు పెట్టి, స్కూల్‌ టేబుల్స్‌, కంప్యూటర్స్‌, ల్యాబ్స్‌, లైబ్రరీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, పుస్తకాలు ముద్రణ, ఎగ్జామ్‌ పేపర్ల తయారీ, నిర్వహణ, ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల కోసం ఒక మూడవ పార్టీ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్టు లెక్కల్లో చూపుతున్నారు. ఆ థర్డ్‌ పార్టీ సంస్థ కూడా శ్రీచైతన్య మేనేజ్‌మెంటే నిర్వహిస్తోంది. అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. సంస్థకు 10 శాతం కమిషన్‌ చెల్లిస్తున్నట్లు చూపుతున్నారు. ఇలా 35కి పైగా ట్రస్ట్‌లు/ సొసైటీల నుండి సర్వీస్‌ చేసినందుకు కమీషన్‌ రూపంలో 10% నుండి 15% వరకు చొప్పున వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. సంస్థలోకి మళ్ళిస్తున్నారు. ఇదే సమయంలో అన్ని రకాల చెల్లింపులు, కొనుగోళ్ళలో భారీగా అవకతవకలు పాల్పడుతూ రెట్టింపు వ్యయం చూపుతూ బ్లాక్‌మనీనీ, వైట్‌మనీగా మార్చుకునేందుకు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.ను ఉపయోగించుకుంటున్నారు. అసలు ట్రస్ట్‌/సోసైటీల నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేని మేనేజ్‌మెంట్‌కి అసలు విద్యాసంస్థలను నిర్వహించే నైతిక హక్కు ఎలా ఉంటుంది. స్టాఫ్‌ దగ్గర నుండి అన్ని రకాల సేవలకు కేవలం ఆయా సొసైటీ నుండే చెల్లించాలి. ఇటువంటి సొసైటీ/ట్రస్ట్‌లను గుర్తించి, వాటికి నోటీసులు అందించి, వాటిని రద్దు చేయవలసిన అవసరం ఏంతైనా ఉంది. ఇదే అవకాశంగా వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.లోకి ఇతర సంస్థల పేరుతో భారీగా పెట్టుబడుల పేరుతో ఇతర కంపెనీల నుండి నిధులను మళ్లించారు. ఒక్క వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. కాకుండా ర్యాంకుగురు టెక్నాలజీస్‌ ప్రై.లి., ఇన్ఫినిటీ లెర్న్‌ టెక్నాలజీ సొల్యుషన్స్‌ ప్రై.లి. కంపెనీల్లోకి భారీగా ఫండ్స్‌ను తరలిస్తోంది శ్రీచైతన్య యాజమాన్యం. సొసైటీల చట్టం ప్రకారం శ్రీచైతన్యను లాభపేక్ష లేని సంస్థగా చూపిస్తున్నారు. చాలా ట్రస్ట్‌లు/సొసైటీలను నష్టాలు చూపిస్తున్నారు. ఈ ట్రస్ట్‌లు, సొసైటీలకు సంబంధించిన నిధులను శ్రీచైతన్య కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు మళ్ళించేందుకు వీలు లేదు. దీంతో నిధుల మళ్ళింపు కోసం వేసిన ఎత్తుగడలో భాగంగా 22 షెల్‌ కంపెనీలకను నెలకొల్పినట్లు తెలుస్తుంది. ఈ షెల్‌ కంపెనీలన్నీ శ్రీచైతన్య ఆధ్వర్యంలోని సొసైటీలు/ ట్రస్ట్‌ లపైనే ఆధారపడి నడుస్తున్నాయి.

భారీగా నల్లధనం మళ్లింపు....

శ్రీ చైతన్య స్టూడెంట్స్‌ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ద్వారా అక్టోబర్‌ 23, 2020 వ తేదీన భారీ వర్షపాతం కారణంగా సిఎం రిలీఫ్‌ ఫండ్‌కి కేటీఆర్‌ ద్వారా రూ. కోటి రూపాయల విరాళం అందించింది. అనంతరం ఏప్రిల్‌ 8, 2022న బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ. 10 కోట్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా పార్టీకి విరాళాలు అందించింది. వీటితో పాటు కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా జనవరి 11, 2024న తెలుగుదేశం పార్టీకి 5 కోట్లు , జనవరి 11, 2024న జనసేన పార్టీకి  రూ.1 కోటి చెల్లింపులు జరిపింది. కేవలం పార్టీ ఫండ్‌ కోసం కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసినట్లు ఈసీ రికార్డుల్లో తేలింది. శ్రీచైతన్య స్టూడెంట్స్‌ ఫెసిలిటీస్‌ మెనేజ్‌మెంట్‌ ప్రై.లి. శ్రీచైతన్య అధినేతల కనుసన్లల్లో నిర్వహించే ఒక షెల్‌ కంపెనీగా తేలింది. ప్రభుత్వాల నుండి ఎటువంటి చర్యలు లేకుండా పార్టీలకు ఫండ్స్‌ అందిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలకు ఫండ్‌లు మరియు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ల కోసమే శ్రీచైతన్య స్టూడెంట్స్‌ ఫెసిలిటీ మేనేజమెంట్‌ ప్రై.లి. కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తేటతెల్లం అయ్యింది. అసలు 10 కోట్ల మూలధనంతో మొదలైన స్టూడెంట్స్‌ ఫెలిసిటీస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. కంపెనీ రూ. 16 కోట్లు పార్టీలకు ఫండ్‌ ఎలా ఇవ్వగలిగింది. కంపెనీ ఆదాయ మార్గాలు ఏమిటి ? కంపెనీ ఎక్కడుంది ? ఎలాంటి సేవలు చేస్తోంది అని ఆరా తీస్తే ముంబాయిలోని ఒక ఫ్లాట్‌ మీద రిజిస్టర్‌ కాగా ఆపరేషన్‌ అన్నీ హైద్రాబాద్‌, మాదాపూర్‌ వేదికగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీచైతన్య సొసైటీలు/ ట్రస్ట్‌లలోని సొమ్మునే వివిధ సేవల పేరుతో  శ్రీ చైతన్య స్టూడెంట్స్‌ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలోకి మళ్ళిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు లేకుండా గత ప్రభుత్వంలోని పార్టీలకు ఫండ్స్‌ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

క్విడ్‌ప్రో కో పాల్పడిన శ్రీచైతన్య !

జూలై 16, 2021లో నియోపోలీస్‌ పేరుతో హెచ్‌ఎండిఏ భూముల అమ్మకం ద్వారా 2000 కోట్లు సమకూర్చుకుంది. ఆ భూముల్లో ఎకరం 42.2 కోట్లు అత్యధికంగా పలికింది. ఈ భూములన్నీ అప్పటి ప్రభుత్వం సొంత వారికి,అనుయాయులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.  వేలానికి ముందే పలువురు రియల్టర్లకు హెచ్‌ఎండీఏలోని అధికారులు సమాచారం చేరవేశారట. తద్వారా ఆ ఫలానా రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారుల చర్యలు తీసుకున్నట్లు తేలింది. దీనిలో భాగంగా ముందుగానే నిర్ణయించిన శ్రీచైతన్య యాజమాన్యానికి చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి కోకాపేటలో 296.95 కోట్ల విలువైన  7.57 ఎకరాల భూమికి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. అదే భూమికి దగ్గరలో  రెండేళ్ళ లోపే ఆగష్టు 3, 2023 నాటికి నియోపోలీస్‌లో సమీపంలోని భూములను వేలం వేసింది. అప్పటికి భూముల ధర ఎకరం రూ. 100 కోట్లు పలికింది. కేవలం రెండేళ్ళ వ్యవధిలో దాదాపు  ఎకరానికి 60 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదంతా 2021లో నియోపోలీస్‌లో భూవేలం ద్వారా 7.57 దక్కించుకున్న 9 నెలల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మొత్తం రూ. 12 కోట్లు ( వర్సిటీ నుండి రూ. 2 కోట్లు) ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా విరాళం అందించింది. ఇక్కడే కోట్లాది రూపాయలు టాక్స్‌ బెనిఫిట్‌ పొందినట్లు అనుమానాలు ఉన్నాయి. వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన ఒక సర్వీస్‌ ఏజెన్సీ మాత్రమే. ఒక సర్వీస్‌ ఏజెన్సీకి ఇన్ని వందల కోట్లతో ప్రభుత్వ భూమిని సొంతం చేసుకుందంటే దాని వెనుక శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన సొసైటీల్లోని డబ్బుని నిబంధనలకు విరుద్ధంగా మళ్ళించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుండి ఆక్షన్‌కి సహాకరించినందుకు గాను దాదాపు 12 కోట్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి విరాళాలు అందించి క్విడ్‌ ప్రో కో పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురు సామాజిక వేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. 2023 ఆగష్టు నాటికి ఆ భూమలు విలువ రూ. 100 కోట్లకు చేరింది. ఇప్పుడు నియో పోలీస్‌లో పాట్లు దక్కించుకున్న వారందరూ బీఆర్‌ఎస్‌ పార్టీకి విరాళాలు అందించిన వారిలో ఉండటం గమనార్హం. 

ఫేక్‌ ఒలింపియాడ్స్‌ సొమ్ము వర్సిటీలోకే !

ఐఎన్‌టీఎస్‌ఓ ఎడ్యుకేషన్‌ సొసైటీ మరియు సి.ఏ.టి. ఎడ్యుకేషన్‌ పేరు మీద ఒలింపియాడ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించిన సొమ్ము అంతా నెక్ట్‌జెన్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీలో జమ చేయటం జరిగింది. అక్కడి నుండి ఆ సొమ్మును ఐఎన్‌టీఎస్‌ఓ ఎడ్యుకేషన్‌ పేరుమీద తరలించినట్లుగా శ్రీచైతన్య యాజమాన్యం చెప్తున్నారు. కానీ ఆ సొమ్మును డైరెక్ట్‌గా పరీక్షల నిర్వహణ పేరు మీద వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.కు తరలించినట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...అసలైన ఒలింపియాడ్స్‌ను పక్కకు పెట్టి శ్రీచైతన్య తన సొంత ఒలింపియాడ్స్‌ను ప్రవేశపెట్టింది. దీనికి ఐఎన్‌టీఎస్‌ఓ అని పేరు పెట్టి మొత్తం 5 రకాల ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తోంది శ్రీచైతన్య. ఈ ఒలింపియాడ్‌ పరీక్షల కోసం అన్నీ శ్రీచైతన్య స్కూల్స్‌లో ఉన్న విద్యార్థులందరిపై అదనపు భారం మోపుతోంది. 5 రకాల ఒలింపియాడ్స్‌ కోసం ఒక్కో పరీక్షకు రూ. 150/- చొప్పున 5 పరీక్షలకు గాను రూ. 750/- వసూలు చేస్తోంది శ్రీచైతన్య. 2022-23 విద్యాసంవత్సరానికి 4 లక్షల మంది విద్యార్థుల దగ్గర నుండి రూ. 750/- చొప్పున రూ.30 కోట్లు వసూలు చేసింది. గత 10 సంవత్సరాలుగా ఈ దోపిడీని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. అలాగే నాలెడ్జ్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ పేరుతో మరో 3 రకాల ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తోంది శ్రీచైతన్య. దీనికి సంబంధించి 3 పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రతీ పరీక్షకు రూ. 200 వసూలు చేస్తోంది. మూడు పరీక్షలకు గాను రూ. 600/`లతో దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల దగ్గర నుండి రూ. 18 కోట్లు వసూలు చేస్తోంది. ఇంతటితో ఆగలేదు. వీరిలో సెలక్ట్‌ అయిన వారిని మరో లెవల్‌ 2 పేరుతో మరోసారి ఎగ్జామ్స్‌ నిర్వహించి మళ్ళీ ఫీజుల వసూళ్ళకు పాల్పడుతోంది. గత 10 ఏళ్ళుగా ఈ దందాను కొనసాగిస్తోంది.

ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ పేరుతో..షెల్‌ కంపెనీలోకి నిధుల ప్రవాహం !

నిర్ణీత ఫీజుతోనే ఒక తరగతిలోని అన్ని పరీక్షలతో పాటు అన్ని సౌకర్యాలు అందించాలి. కానీ శ్రీచైతన్య బుక్స్‌కి ఎక్స్‌ట్రా, డ్రస్‌కి ఎక్స్‌ట్రా, ఒలింపియాడ్స్‌కి ఎక్స్‌ట్రా, ఇన్ఫినిటీ మెటా జానియర్‌ యాప్‌కి ఎక్స్‌ట్రా.. ఇలా తల్లిదండ్రుల్ని వివిధ రకాల ఫీజుల పేరుతో స్కూల్‌ ఫీజు కన్నా ఎక్కువగా దోచుకుంటోంది శ్రీచైతన్య. దీంతో తల్లిదండ్రులు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీస్తోంది శ్రీచైతన్య. కోవిడ్‌ 19 సమయంలో అంతా ఆన్‌లైన్‌ అయిన సందర్భంలో యాప్‌ ద్వారా బోధన జరిగింది. దానిని అడ్డం పెట్టుకుని ఇప్పటికీ ఆ యాప్‌ని బలవంతంగా విద్యార్థులపై రుద్ది తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజలు లాగేస్తున్నారు. క్లాస్‌రూమ్‌ డైరెక్ట్‌గా బోధిస్తున్నప్పుడు ఆన్‌లైన్‌ యాప్‌లోతో పనేముంది. శ్రీచైతన్య దోపిడీకి అలవాటు పడిరది అని ఈ విషయం చెప్పకనే చెబుతోంది. ఇక ఈ ఫీజుని నెక్ట్‌జెన్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరు మీద వసూలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య స్కూల్స్‌ మరియు కాలేజ్‌లలో చదివే 6 లక్షల మంది దగ్గర నుండి ఇన్ఫినిటీ మెటా జూనియర్‌ యాప్‌ పేరుతో స్కూల్‌ పిల్లల దగ్గర రూ. 2000/`  ఇన్ఫినిటీ లెర్న్‌ యాప్‌ పేరుతో కాలేజీ విద్యార్థుల దగ్గర రూ. 3000/` గుంజుకుంటోంది. రూ. సరాసరిన రూ. 2500/` వసూలు చేసినా కోటానుకోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. ఈ నిధులన్నీ నెక్ట్‌జన్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ నుండి శ్రీచైతన్య యాజమాన్యం ఆధ్వర్యంలోని ర్యాంక్‌గురు టెక్నాలజీ సొల్యుషన్స్‌ ప్రై.లి. కంపెనీలోకి మళ్ళిస్తోంది. విద్య ఏ రూపంలో ఉన్నా సేవ క్రిందే వస్తుంది కానీ సొసైటీల పేరుతో వసూలు చేయటం, శ్రీచైతన్య షెల్‌ కంపెనీలైన ప్రై.లిమిటెడ్‌ కంపెనీల్లో కి మళ్ళించటం వాటిని సొంతానికి వాడుకోవటంలో శ్రీచైతన్య ఆరితేరిపోతుంది. అసలు ఈ యాప్‌ని వినియోగించుకునే వారి సంఖ్య అత్యల్పం. దీని వలన ప్రయోజనం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పుస్తకాలతో పాటు యాప్‌కి కూడా డబ్బు కడితేనే పుస్తకాలు ఇస్తామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ దోపిడీని అడ్డుకోవలసినదిగా ప్రభుత్వాలను కోరుతున్నారు. పైకి ఇన్ఫినిటీ మెటా జూనియర్‌ యాప్‌ ఉచితం అని చెప్తూనే ఒక్క శ్రీచైతన్య విద్యార్థులకు మాత్రమే యాక్సిస్‌ కల్పిస్తోంది. ఇందులో డబ్బులు దండుకునే దురుద్ధేశ్యమే కన్పిస్తోంది. ఇంతటిలో ఆగలేదు శ్రీచైతన్య, స్కోరు పేరుతో రూ. 1000 కోట్లు విలువైన బోగస్‌ స్కాలర్‌షిప్‌ను నిర్వహిస్తోంది. పరీక్షల అనంతరం అర్హత సాధించిన వారి వివరాలు ప్రకటించలేదు. శ్రీచైతన్యలో చేరే విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది అని షరతులతో మోసగిస్తోంది. ఈ స్కోర్‌ ఎగ్జామ్‌ని ర్యాంక్‌గురు టెక్నాలజీస్‌ ప్రై.లి. నిర్వహించటం గమనార్హం. 







Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
Sri chaitanya Block Money : శ్రీచైతన్య...నల్లధనం కేరాఫ్‌గా వర్సిటీ !
INFINITY META APP : ఆన్‌లైన్‌ పేరుతో ఇన్ఫినిటీ దోపిడీ !
Suicides in Sri chaityana Hostels: కార్పొరేట్‌ హాస్టల్స్‌లో ఘోషిస్తున్న ఆత్మలు !
Sri Chaitanya : Jee Main 2025లో శ్రీచైతన్య గోల్‌మాల్‌ రిజల్ట్స్‌ !
INFINITY LEARN : ర్యాంక్‌గురు (ఇన్ఫినిటీ లెర్న్‌ ) మరో బైజూస్‌ కానుందా ?
IT Rides on Sri Chaitanya : కొత్త తరహా మోసంలో శ్రీచైతన్య నేషనల్‌ రికార్డ్‌ !