Ticker

6/recent/ticker-posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !

  • ఇబ్బడిముబ్బడిగా ప్రై.లి. కంపెనీలు ! 
  • నామామాత్రపు పెయిడప్‌ క్యాపిటల్‌తో కంపెనీలు ఓపెన్‌ !
  •  శ్రీచైతన్య సెంట్రల్‌ ఆఫీస్‌ ప్రాంతంలోనే షెల్‌ కంపెనీల ఏర్పాటు ! 
  • రియల్‌ ఎస్టేట్‌లోనూ రాణిస్తున్న శ్రీచైతన్య సిస్టర్స్‌ !

ఆ సంస్థల్లో ఉద్యోగులు ఉండరు, ఆస్తులు ఉండవు, నిజానికి అసలు వ్యాపార కార్యకలాపాలు ఉండవు. కానీ పేపర్ల మీద కంపెనీలు నడుస్తూనే ఉంటాయి. టర్నోవర్‌ మాత్రం కోట్లలో నడుస్తుంది. ఎలా అంటే అదే శ్రీచైతన్య షెల్‌ కంపెనీల మాయాజాలం. ప్లాట్‌ నెం. 81, సంతోష్‌ టవర్స్‌, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌ చిరునామా పేరు మీద బ్రౌన్‌ స్టోన్‌ ఎడ్యుకేషన్‌ ప్రై.లి., ర్యాంక్‌గురు టెక్నాలజీ సొల్యుషన్స్‌ ప్రై.లి., శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రై.లి, అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రై.లి. ఏకంగా 4 కంపెనీలు రిజిస్టర్‌ అయి ఉన్నాయి. అదే విధంగా ప్లాట్‌ నెం. 304, కాశెట్టి టవర్స్‌, అయ్యప్ప సొసైటీ, మాధాపూర్‌ అడ్రస్‌తో  కోయిస్‌ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి., కె12 ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ ప్రై.లి., శ్రీచైతన్య ఇన్ఫోసిస్టమ్స్‌ ప్రై.లి., వర్సిటీ ఎడ్యుఫికేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి., వర్సిటీ సౌత్‌ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. కంపెనీలు రిజిస్టర్‌ అయ్యాయి. 6 వ అంతస్థు, ఎన్‌.సి.సి. బిల్డింగ్‌, దుర్గంచెరువు చిరునామాతో ఇన్ఫినిటీ లెర్నింగ్‌ టెక్నాలజీ ప్రై.లి., విజ్‌క్లబ్‌ లెర్నింగ్‌ ప్రై.లి., జోకా సొల్యుషన్స్‌ ప్రై.లి. కంపెనీలు రిజిస్టర్‌ చేయబడ్డాయి. అలాగే ప్లాట్‌ నెం. 80, శ్రీ సాయి ప్లాజా అడ్రస్‌ పేరుతో జూనియర్‌ వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి., కె12 ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌, శ్రీచైతన్య స్టూడెంట్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి., వర్సిటీ ఎడ్యుకేషన్‌  మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. పేర్లతో వివిధ కంపెనీలు నమోదు చేయబడ్డాయ. అలాగే డోర్‌ నెం. 54`20/ 9`6, తిమ్మరుసు వీధి, శ్రీనగర్‌కాలనీ, శ్రీకాకుళం, విజయవాడ అనే చిరునామాతో ఏకంగా బీ.జె.ఎస్‌.బిల్డర్స్‌ ప్రై.లి., శ్రీవైభవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రై.లి., శ్రీవైష్ణవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌, శ్రీ వనమాలి అగ్రో ఫామ్స్‌ ప్రై.లి., శ్రీవింధ్య నర్సరీస్‌ ప్రై.లి., ఆశ్రియ ఎడ్యుకేషన్‌ ప్రై.లి., గ్రీన్‌వే టౌన్‌షిప్‌ ప్రై.లి. శ్రీవైభవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రై.లి., శ్రీ వశిష్ట ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రై.లి. శ్రీ విహార్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రై.లి పేర్లు మీద వివిధ రియల్‌ ఎస్టేట్‌ సంబంధించిన కంపెనీలు రిజిస్టర్‌ చేయబడ్డాయి. ఇవీ అన్నీ శ్రీచైతన్య యజమానులైన బొప్పన సుష్మశ్రీ, బొప్పన సీమ పేర్ల మీద నెలకొల్పిన షెల్‌ కంపెనీల లిస్ట్‌ ఇదీ. బొప్పన సుష్మశ్రీ పేరు మీద మొత్తం 26 డొల్ల కంపెనీలు రిజిస్టర్‌ కాగా, అందులో భాగస్వాములుగా బొప్పన జాన్సీలక్ష్మీభాయి, బొప్పన సీమ భాగస్వాములుగా ఉన్నారు. మరో 7 కంపెనీలు బొప్పన సీమ పేరు మీద ప్రత్యేకంగా రిజిస్టర్‌ కాబడ్డాయి.

డొల్ల కంపెనీల సామ్రాజ్యం !

శ్రీచైతన్య విద్యాసంస్థల పేరుతో ఉన్న వేరువేరు సొసైటీలు/ ట్రస్ట్‌ల నుండి డబ్బును వివిధ రకాల సేవల పేరుతో శ్రీచైతన్య యాజమాన్యం చేతిలోని ప్రై.లి. కంపెనీల్లోకి పెద్ద ఎత్తున మళ్ళిస్తోంది. దాని కోసం పెద్ద ఎత్తున దాదాపు 25 కు పైగా షెల్‌ కంపెనీలను సృష్టించింది. సొసైటీల్లోని సొమ్మును ప్రై.లి. కంపెనీల్లోకి తరలిస్తోంది. అదీ కాక సేవలు చేసినందుకు కాను 10 % నుండి 15% ఫీజును వసూలు చేస్తోంది. ఈ కంపెనీలు ఉన్న బిల్డింగ్‌లను ఒక్కసారి పరిశీలిస్తే...ఒక్క వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లిమిటెడ్‌ కంపెనీ, ఇన్ఫినిటీలెర్న్‌ ఉద్యోగులు మాత్రమే కనిపిస్తున్నారు. వారందరూ శ్రీచైతన్య ఉద్యోగులు అని చెప్తున్నారు. శ్రీచైతన్య స్కూల్స్‌, కాలేజీల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా ఇతర కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు కనిపించరు. కంపెనీలచట్టంప్రకారం ఒకే వ్యక్తి 20 కంపెనీలకు మించి డైరెక్టర్‌గా వ్యవహరించేందుకు నిబంధనలు అంగీకరించవు. కానీ బొప్పన సుష్మశ్రీ, బొప్పన సీమ దాదాపు 20కి పైగా సంస్థల్లో వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకరికి ఒకరు సెక్యూరిటీగా చూపిస్తూ రుణాలు పొందుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా షెల్‌ కంపెనీల ద్వారా భారీగా నగదును చెలామణిలోకి తెచ్చేందుకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలలో అయితే ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహంచటం లేదు. ఎక్కువ శాతం కంపెనీలు నష్టాలను చూపుతున్నట్లు తెలుస్తోంది. నామమాత్రపు పెయిడప్‌ క్యాపిటల్‌తో కంపెనీలు ప్రారంభించటం,  షేరుకు అధిక ప్రీమియం కారణంగా ఖాతాల్లో అధిక నిల్వలు ఉంచుకోవటం, అన్‌లిస్టెడ్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం, డివిడెండ్‌ ఆదాయం లేకపోవడం, అత్యధికంగా నగదు నిల్వలుండటం ఈ కంపెనీల ప్రత్యేకత. అంతేకాకుండా డైరెక్టర్లపేరుతో రిటర్నులు దాఖలుచేస్తున్నాయి. ఈ డైరెక్టర్లే సుమారు 25 నుంచి 30 కంపెనీలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా డైరెక్టర్ల హోదాలో భారీగా జీతాలు పొందుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలు అయితే విజయవాడ కేంద్రంగా నడుస్తున్న కంపెనీలు అయితే  స్థిరాస్తులుగా వ్యవసాయభూములను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. బిల్డర్స్‌, ఇన్‌ఫ్రా, ఆగ్రోఫామ్స్‌ పేరుతో భారీ ఎత్తున భూములు మరియు రియల్‌ ఎస్టేట్‌ వంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఆయా ఆస్థులను షెల్‌ కంపెనీల పేరుతో ఉంచుతారు. అదే విధంగా వివిధ రకాల సేవల పేరుతో షెల్‌ కంపెనీల ద్వారా నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి కంపెనీల ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ బిల్లులు చెల్లించేటప్పుడు చట్టబద్ధమైన ఖర్చుల నెపంతో అక్రమ నగదును బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో అక్కాచెల్లెళ్ళు !

ఇప్పటి దాకా విద్యారంగంలో మాత్రమే రాణిస్తున్న అక్కాచెల్లెళ్ళు అయిన బొప్పన సుష్మశ్రీ, బొప్పన సీమ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పటికే శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై.లి. పేరుతో రూ. 600 కోట్లు, అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రై.లి. పేరుతో రూ. 600 కోట్లు వ్యాపారం సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు శ్రీచైతన్య సిస్టర్సే అధినేతలు. కానీ ఈ రెండు కంపెనీలు ప్లాట్‌ నెం. 81, సంతోష్‌ టవర్స్‌, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌ చిరునామా మీద రిజిస్టర్‌ అయ్యాయి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా శ్రీచైతన్య ఉద్యోగులే.  అంటే ఈ రెండు శ్రీచైతన్య సిస్టర్స్‌కు చెందిన షెల్‌ కంపెనీలే. ఎలాంటి ఆపరేషన్స్‌ లేకుండా ఈ రెండు కంపెనీల విలువ రూ. 1200 కోట్లుగా ఉంది అంటే ...ఆ సొమ్ము అంతా ఎక్కడనుండి వచ్చింది. ఇది కేవలం శ్రీచైతన్య సొసైటీల నుండి తరలించిన నల్లధనమే అంటున్నారు. ఈ కంపెనీలు అన్నీ పేపర్ల మీదే ఉంటాయి. ఉద్యోగులు ఉండరు, వ్యాపార కార్యకలాపాలు ఉండవు. ఇంత కన్న రుజువులు కావాలా శ్రీచైతన్య షెల్‌ కంపెనీలు నిర్వహిస్తోంది అనటానికి.

క్విడ్‌ ప్రో కో...సాక్ష్యం !

22, మే 2021 టాటా క్యాపిటల్‌, ముంబాయి నుండి 335 కోట్ల రుణం, 24, మే 2021 బజాజ్‌ ఫైనాన్స్‌, పుణె నుండి 350 కోట్ల అప్పు, 26, మే 2021 హీరో ఫిన్‌ కార్ప్‌, డిల్లీ నుండి 135 కోట్ల రుణం, 27, మే 2021 ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ నుండి 165.17 కోట్ల రుణం మొత్తంగా 985.17 కోట్లు కాగా 29, జూన్‌ 2021 ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ నుండి మరో 150 కోట్ల రుణం మొత్తంగా 1135.17 కోట్ల రుణం తీసుకుంది వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి కంపెనీ... జూలై 16, 2021లో నియోపోలీస్‌ పేరుతో హెచ్‌ఎండిఏ భూముల వేలం నిర్వహించింది. అంటే ఒక నెల ముందుగానే కోకాపేటలో భూముల అమ్మకం గురించి దానిని తెర వెనుక దక్కించుకునేందుకు వివిధ సంస్థల నుండి అప్పుల రూపంలో డబ్బు సమకూర్చుకుంది అనటానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఫలానా వారికే భూములు దక్కేలా అధికారుల ద్వారా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ముందుగానే నిర్ణయించిన శ్రీచైతన్య యాజమాన్యానికి చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి కోకాపేటలో ఎకరం 42.2 కోట్లు చొప్పున 296.95 కోట్ల విలువైన  7.57 ఎకరాల భూమికి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. భూమిని దక్కించుకోవడానికి సహకరించినందుకు గాను ప్రభుత్వం నుండి ఆక్షన్‌కి సహాకరించినందుకు గాను దాదాపు 12 కోట్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి విరాళాలు అందించి శ్రీచైతన్య క్విడ్‌ ప్రో కో పాల్పడినట్టు తెలుస్తోంది.




Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
Sri chaitanya Block Money : శ్రీచైతన్య...నల్లధనం కేరాఫ్‌గా వర్సిటీ !
INFINITY META APP : ఆన్‌లైన్‌ పేరుతో ఇన్ఫినిటీ దోపిడీ !
Suicides in Sri chaityana Hostels: కార్పొరేట్‌ హాస్టల్స్‌లో ఘోషిస్తున్న ఆత్మలు !
INFINITY LEARN : ర్యాంక్‌గురు (ఇన్ఫినిటీ లెర్న్‌ ) మరో బైజూస్‌ కానుందా ?
IT Rides on Sri Chaitanya : కొత్త తరహా మోసంలో శ్రీచైతన్య నేషనల్‌ రికార్డ్‌ !
Sri Chaitanya Hostel : శ్రీచైతన్యపై చర్యలు ఉండవా ? రంగంలోకి AP ‘ముఖ్య’నేత !?