నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG- 2024) ఫైనల్ ఆన్సర్ కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. NEET ఫలితాలతో పాటు ఆల్‌ఇండియా టాపర్ల వివరాలను మరియు కేటగిరీ వారీగా కట్`ఆఫ్ మార్కులు మరియు పర్సంటైల్ ర్యాంకులను NTA ప్రకటించింది. శ్రీచైతన్య 720 మార్కులకు గాను 720 మార్కులను సాధించే వారి వివరాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఆ ప్రకటనలో 7 గురు విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించినట్లు విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. 3 (ముగ్గురు) స్టూడెంట్స్ పేరు ప్రక్కన DLP (డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్) AITS (ఆల్‌ఇండియా టెస్ట్ సిరీస్) అని 3 పేరు ప్రక్కన తోక తలిగించారు. అంటే శ్రీచైతన్య అసలైన విద్యార్థులు 4 గురు మాత్రమే 720 మార్కులు సాధించారు. అంటే మిగతా 3 (ముగ్గురు) వేరే సంస్థలో క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్ ద్వారా చదివిన వారు, శ్రీచైతన్యలో డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా చదివినట్లు చెప్పి ప్రకటనల్లో వాడుకుంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ర్యాంకు సాధించిన అసలైన సంస్థ నుండి ర్యాంకులు కొనుగోలు చేసి తమ ర్యాంకులుగా శ్రీచైతన్య ప్రకటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదీ చాలదు అన్నట్లు నీట్ యూజీ 2024 ఫలితాలు అని ప్రకటించిన ప్రకటన మధ్యలో గత సంవత్సరం 1 ఫస్ట్ ర్యాంకు ప్రకటించటం శ్రీచైతన్య దిగజారుడు తనానికి నిదర్శనం.
0 Comments