Ticker

6/recent/ticker-posts

Sri Chaitanya : శ్రీచైతన్య వెనుక దాగిన చీకటి కోణాలు ఒకొక్కటి వెలుగులోకి !

 
బొప్పన సత్యనారాయణ రావు (బి.ఎస్‌.రావు) ,రaాన్సీలక్ష్మీ బొప్పన భాయి అంటే శ్రీచైతన్య పేరు గుర్తుకువస్తుంది. 4 దశాబ్దాలుగా ఆ పేరు అలా చెరగని ముద్ర వేసింది. కానీ శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. కంపెనీకి ఓనర్లు కూడా బి.ఎస్‌.రావు, రaాన్సీలక్ష్మీభాయి అంటే ఎవరైనా నమ్ముతారా ? కానీ ఇది నిజం. శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌కి వీరే ఓనర్లు.  కానీ ఆ  సంస్థ పేరు ఎక్కడ వినిపించదు, ఎక్కడా సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు నడవవు. ఉద్యోగులు ఉండరు, చిరునామాలో వేరే సంస్థ (శ్రీచైతన్య) ఉంటుంది. కానీ శ్రీ వాల్మీకి పేరు మీద 8, జూలై 2021 బజాజ్‌ ఫైనాన్స్‌, పుణె నుండి 350 కోట్ల అప్పు,  21, జూన్‌ 2021 హీరో ఫిన్‌ కార్ప్‌, డిల్లీ నుండి 135 కోట్ల రుణం,  14, జూన్‌ 2021 టాటా క్యాపిటల్‌, ముంబాయి నుండి 335 కోట్ల రుణం పొందినట్లు పుస్తకాల్లో చూపించారు. నిజానికి ఇదే అప్పు వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. పేరు మీద ఒక నెల అటుఇటుగా ఎస్‌.ఆర్‌.ఎన్‌. మరియు ఛార్జ్‌ ఐడీల మార్పుతో 820 కోట్లు రుణం తీసుకున్నట్లు చూపించారు. కానీ డేట్‌ ఆఫ్‌ శాటిస్‌ఫ్యాక్షన్‌ మాత్రం ఒకటే తేదీ ఉండటం గమనార్హం. రెండు వేర్వేరు కంపెనీలు కొన్ని తేదీల మార్పుతో ఒకే కంపెనీ దగ్గర డబ్బులు తీసుకున్నట్లు రికార్డుల్లో తేలింది. కొన్ని తేదీల వ్యవధిలో ఒకే సారి పెద్దమొత్తంలో ఒకే  ప్రైవేట్‌ ఫైనాన్స్‌ అప్పు ఇవ్వటం అసాధ్యం. కానీ ఆయా ప్రై.కంపెనీల యాజమాన్యాలు రెండు కంపెనీల్లో ఒకే అప్పును ఎలా చూపిస్తున్నాయి. రికార్డులను టాంపరింగ్‌ చేసి అప్పులు ఎక్కువ చూపి కంపెనీ నష్టాలు చూపించి ట్యాక్స్‌లు ఎగవేతకు పాల్పడుతున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. నిర్వహకులు ఎవరో కాదు శ్రీచైతన్య వ్యవస్థాపకులు బి.ఎస్‌.రావు గారు, ఆయన సతీమణి రaాన్సీలక్ష్మీభాయి గారు, కాగా వర్సిటీ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. ను శ్రీచైతన్య ప్రస్తుత డైరెక్టర్లు సుష్మశ్రీ, సీమ, యలమంచిలి శ్రీధర్‌లు నడిపిస్తున్నారు. కేవలం 25 లక్షల ఆథరైడ్‌ క్యాపిటల్‌ ఉన్న శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. కంపెనీకి 820 కోట్లు అప్పులు ఎలా ఇచ్చారు అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. సర్వే నెం. 399/2, పోరంకి విలేజ్‌, పెనమలూరు, విజయవాడ అడ్రస్‌తో ఉన్న కంపెనీకి బుక్స్‌ మెయింటినెన్స్‌ మాత్రం హైద్రాబాద్‌ అయ్యప్ప సొసైటీ...శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి. కంపెనీ కూడా శ్రీచైతన్యకు చెందిన మరో షెల్‌ కంపెనీ అని తేటతెల్లం అయ్యింది.  

ఇప్పటికీ 21 షెల్‌ కంపెనీల్లో డైరెక్టర్‌గా రaాన్సీలక్ష్మీబాయి !

బి.ఎస్‌.రావు దివంగతులై 10 నెలలు గడుస్తున్నా యంగ్‌ఎవర్‌ నేచురల్‌ సొల్యుషన్స్‌ ప్రై.లి, శ్రీ విశ్వేశ్వర హార్టికల్చర్‌ ప్రై.లి., శ్రీ వశిష్ట హార్టికల్చర్‌ ప్రై.లి, శ్రీవిష్ణు నర్సరీస్‌ ప్రై.లి, శ్రీవికాస్‌ హార్టికల్చరల్‌ ప్రై.లి, శ్రీ విహారికా హార్టికల్చర్‌, శ్రీ వసుధ నర్సరీస్‌, శ్రీ వందన నర్సరీస్‌ ప్రై.లి.,  శ్రీ వంశధార హార్టికల్చర్‌ ప్రై.లి., శ్రీవైభవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రై.లి. పేరు మీద ఇప్పటికీ బి.ఎస్‌.రావు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అలాగే ఆయన సతీమణి రaన్సీలక్ష్మీభాయి దాదాపు 21 కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ కంపెనీల్లో అత్యధిక శాతం విజయవాడ చిరునామాతో నడుస్తున్నాయి. కానీ ఉద్యోగులు, కార్యకలాపాలు ఉండవు. ఓన్లీ పేపర్ల మీదే కొనసాగుతున్నాయి. శ్రీచైతన్య సొసైటీలు/ ట్రస్ట్‌ల నుండి సొమ్మును వివిధ మార్గాల్లో తరలించేందుకు ఎంచుకున్న మార్గం ప్రై.లి. కంపెనీలు.  ఒక కంపెనీ నుండి సబ్‌ కంపెనీలకి, సబ్‌ కంపెనీల నుంచి మరో సబ్‌ కంపెనీలు, అక్కడ నుంచి చిన్న కంపెనీలు ఇలా గొలుసుకట్ట పద్ధతిలో కంపెనీలు సృష్టించి నకిలీ ఇన్‌వాయిస్‌లతో నగదు లావాదేవీలు జరుగుతున్నట్లు చూపుతున్నట్లు తెలుస్తోంది. పేపరు మీదే కోట్లలో టర్నోవర్‌లు చూపి బ్యాంకులు, వివిధ ఫైనాన్షియల్‌ సంస్థల నుండి కోట్లాది రూపాయలు లోన్లు పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇలా నల్లధనాన్ని తరలిస్తున్న కంపెనీల మీద ఎలాంటి అనుమానాలు రాకుండా జీఎస్టీ, ఇన్‌కంటాక్స్‌ ఫైలింగ్‌ చేస్తూ ఇన్‌కంటాక్స్‌, ఈడీ దృష్టిలో పడకుండా జాగ్రత్త పడుతోంది శ్రీచైతన్య యాజమాన్యం.  ఈ సందర్భంగా శ్రీవైభవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ కంపెనీ ఆథరైజ్డ్‌ క్యాపిటల్‌ విలువ రూ. 2 కోట్లు. కానీ కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహిస్తోంది. కానీ 2013, 14  సంవత్సరాల్లో  దాదాపు రూ. 116 కోట్లు బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంది. ఫేక్‌ టర్నోవర్‌తో బ్యాంకులను మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలను అడ్డం పెట్టుకుని నల్లధనాన్ని భారీగా మార్చుతున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
Sri chaitanya Block Money : శ్రీచైతన్య...నల్లధనం కేరాఫ్‌గా వర్సిటీ !
INFINITY META APP : ఆన్‌లైన్‌ పేరుతో ఇన్ఫినిటీ దోపిడీ !
Suicides in Sri chaityana Hostels: కార్పొరేట్‌ హాస్టల్స్‌లో ఘోషిస్తున్న ఆత్మలు !
Sri Chaitanya : Jee Main 2025లో శ్రీచైతన్య గోల్‌మాల్‌ రిజల్ట్స్‌ !
INFINITY LEARN : ర్యాంక్‌గురు (ఇన్ఫినిటీ లెర్న్‌ ) మరో బైజూస్‌ కానుందా ?
IT Rides on Sri Chaitanya : కొత్త తరహా మోసంలో శ్రీచైతన్య నేషనల్‌ రికార్డ్‌ !