- టాలెన్‌టెక్స్ పేరుతో ప్రతిభావంతులకు వల విసురుతున్న అలెన్ !
- ఎగ్జామ్ పేరుతో ఒక్కో విద్యార్థి నుండి రూ. 300/` వసూలు !
- రూ. 2.5 కోట్ల నగదు బహుమతులు ఓకే !
- రూ. 250 కోట్ల స్కాలర్‌షిప్‌లు ఉత్తమాటే.
- ఫలితాల రోజు విశ్వసనీయత చాటుకుంటుందా ?
- ఇతర స్కూల్స్/కాలేజీల్లో టాపర్స్ సమాచారం తెలుసుకోవటమే టార్గెట్ !
ప్రతీ రూపాయిని ముక్కు పిండి వసూలు చేసే ప్రైవేటు/ కార్పొరేట్ సంస్థలు రూ. 250 కోట్ల స్కాలర్‌షిప్ ఇస్తున్నాం అంటే నమ్మేస్తున్నారా ? స్కాలర్‌షిప్‌తో మీ పిల్లల్ని చదివించాలని ఆశపడుతున్నారా ? అయితే మీరు అత్యాశలో కాలేసినట్టే. ఇది ALLEN సంస్థ చేసే మాయాజాలం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. విజ్ఞులైన తల్లిదండ్రులారా ఒక్కసారి పరిశీలించండి, మీ కష్టార్జితాన్ని ప్రైవేటు/ కార్పొరేట్ సంస్థలు ఎలా దోచుకుంటున్నాయో తెలుసుకోండి.
TALLENTEX కోసం భారీ ప్రచారం !
250 కోట్ల టాలెన్స్‌టెక్స్ భారీ స్కాలర్‌షిప్ అంటూ ఆకర్షణీమమైన ప్రకటనలో సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది ALLEN సంస్థ. పైకి స్కాలర్‌షిప్ టెస్ట్ మాత్రమే, కానీ దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను వెతికి వెతికి పట్టుకోవటమే ఈ స్కాలర్‌షిప్ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం. అలెన్ సంస్థలోని విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా ఇతర విద్యాసంస్థల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను వెతికి పట్టుకోవటమే TALLENTEX ఎగ్జామ్ టార్గెట్. అలెన్ స్కాలర్‌షిప్ వ్రాయడానికి సిద్ధపడ్డారా...ఇక అంతే సంగతులు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వివరాలను (డేటా) లాగేసుకుంటుంది. అలాగే దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రతిభ చూపిన ఇతర స్కూల్స్ విద్యార్థుల వివరాలు సేకరిస్తుంది. ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత విద్యను ఆఫర్ చేయటం దగ్గర నుండి భారీ నగదు ఆశచూపి తమ విద్యాసంస్థల్లో చేరేలా మభ్యపెట్టటమే ఈ TALLENTEX స్కాలర్‌షిప్ వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఎందుకంటే బాగా టాలెంటెడ్ విద్యార్థులు రాబోయే రోజల్లో నీట్, జెఈఈ అడ్వాన్స్‌డ్ లాంటి ఎగ్జామ్స్‌లో 10 లోపు ర్యాంకు సాధిస్తే సంస్థ తలరాతే మారిపోతుంది. ఒక్క ర్యాంకు సాధిస్తే చాలు వేలాది అడ్మిషన్లు వచ్చేస్తాయి. గత సంవత్సరం ALLEN ఫలితాలను తీసుకుంటే జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ వంటి ఎగ్జామ్స్‌లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మంచి ఫలితాలను సాధించింది. ఆ ర్యాంకులతోనే మార్కెటింగ్ చేసుకుంటోంది. అలెన్‌లో చదివితే ఫస్ట్ ర్యాంకు వస్తుంది అని నమ్మిస్తోంది. కేవలం 10 లోపు, 100 లోపు ర్యాంకులు చూపించి లక్షలాది విద్యార్థులను ఆకర్షిస్తున్నారు అంటే నమ్ముతారా ? మరి అలెన్‌లో చదివిన ప్రతి విద్యార్థికి ఆలిండియా ర్యాంకు వస్తుందా ? పేరెంట్స్ ఎందుకు ఆలోచించటం లేదో వారికే తెలియాలి. ఎందుకంటే తమ పిల్లాడికి మంచి ర్యాంకు వస్తుందేమోనని ఆశ. అదే ఆశే ప్రైవేటు విద్యాసంస్థలకు వరంగా మారింది. కాసుల వర్షం కురిపిస్తోంది.
2024లో స్కాలర్‌షిప్ ఎంత మందికి ఇచ్చారో లిస్ట్ ప్రకటించగలరా ?
రూ.250 కోట్ల స్కాలర్‌షిప్ ఇవ్వటం అనేది ఉత్తమాట. ఒకవేళ వేరే సంస్థలో చదువుతూ అలెన్ TALLENTEX ఎగ్జామ్‌లో మంచి ఫలితం వచ్చినా ప్రయోజనం దక్కదు. ఎందుకంటే ALLEN సంస్థలో క్లాస్‌రూమ్‌లో కానీ, డిజిటల్ కోర్సుల్లో కానీ అడ్మిషన్ తీసుకున్న వారికే మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. అదీ కూడా ఫీజులో 90% వరకు మాత్రమే అందిస్తుంది. కావాలంటే ALLEN సంస్థ విధించిన షరతులు ఒక్కసారి పరిశీలిస్తే మీకే అర్థం అవుతుంది. ఆ షరతులు అన్నీ ALLEN సంస్థకు అనుకూలంగా ఉంటాయి. చివరికి మోసపోతున్నది విద్యార్థులే. ప్రతిభావంతులని గుర్తించటం, వారిని తమ సంస్థల్లో చేర్చుకోటం, టాప్ ర్యాంకులు సాధించిన వారిని ప్రమోట్ చేసుకోవటం, లక్షలాది మందిని అలెన్‌లోకి ఆకర్షించటం...ఇది ALLEN సంస్థలో నిరంతరం జరిగిఏ ఒక ప్రక్రియ. మరోవైపు ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ దగ్గర నుండి సరాసరిన 300/- వసూలు చేస్తున్నారు. గత సంవత్సరం 316000 లకు పైగా విద్యార్థులు ఎగ్జామ్‌వ్రాయగా, ఈ సంవత్సరం 3.5 లక్షల మంది చేత ఎగ్జామ్ వ్రాయించాలనే లక్ష్యంగా పెట్టుకుంది అలెన్ సంస్థ. ఈ లెక్కన సుమారు 10.5 కోట్ల రూపాయలు ఎగ్జామ్ ఫీజుల రూపంలో అలెన్‌కు లభిస్తోంది. ఎగ్జామ్ వ్రాసే వరకే అలెన్ సంస్థ హడావిడి, ఆ తర్వాత కేవలం రూ. 2. 5 కోట్ల రూపాయల నగదు బహుమతులు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంటుంది. రూ. 250 కోట్లు రూపాయల స్కాలర్‌షిప్ పొందిన వారి వివరాలను ప్రకటించటం లేదు. TALLENTEX వెబ్‌సైట్ వెతికినా ఎక్కడ సమాచారం లభించదు. అలెన్ సంస్థల్లో చదివే కొందరు ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తోంది. గత 2 సంవత్సరాలుగా అలెన్ నిర్వహించిన TALLENTEX స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్‌లో రూ. 250 కోట్లు ఎంత మంది విద్యార్థులు సాధించారో పూర్తి వివరాలతో కూడిన సమాచారం ప్రజలకు అందించే సాహసం అలెన్ సంస్థ చేయగలదా ?
ALLEN విశ్వసనీయతకు ఇది పరీక్ష !
TALLENTEX -2025 పేరుతో నిర్వహించే ఈ స్కాలర్‌షిప్ ఎగ్జామ్ ఫలితాలను నవంబర్, 2024న ప్రకటించనున్నట్లు అలెన్ తెలిపింది. అయితే రూ. 250 కోట్ల స్కాలర్‌షిప్ సాధించిన విద్యార్థుల పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో వెల్లడిరచే ధైర్యం ALLENకి ఉందా ? ALLENసంస్థలో చేరితేనే స్కాలర్‌షిప్ ఇస్తాం. ఎందుకంటే ఎలాంటి స్కార్ మార్కులు కానీ రూ. 250 కోట్ల వద్ద అలెన్‌టెక్స్ ప్రకటనలో పొందుపరచలేదు. ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా రూ. 250 కోట్ల రూపాయలు స్కాలర్‌షిప్ రూపంలో నగదును విద్యార్థులకు అందించి విశ్వసనీయతను చాటుకునే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
0 Comments