వర్సిటీలో వర్సీటీ వాటా నామమాత్రమే !
అసలు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌కి 1,65,02,002 షేర్స్ ఉంటే మెజార్టీ వాటా 1,47,55,584 షేర్లు కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ఎల్.ఎల్.పి. అనే సంస్థకు చెందినదే. దీని నిర్వాహకులు బొప్పన సుష్మ, బొప్పన సీమ. వీరిద్దరూ వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.కి (VARSITY EDUCATION MANAGEMENT PVT LTD) చెందిన డైరెక్టర్సే. అంటే వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.కి దాదాపు 88% వాటా (COEUS EDUCATION MANAGEMENT PVT LTD ) కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. దే. 19-10-2022 వ తేదీన షేర్‌ల బైబ్యాక్ పేరుతో రూ. 5 ముఖ విలువ కలిగిన 11, 08, 976 షేర్లను ఒక్కొ షేరుకు రూ. 1893.64 రూ. చెల్లించి రూ. 210000131/- కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌కి చెల్లించారు. అదే విధంగా 30-09-2024 న మరోసారి షేర్‌ల బైబ్యాక్ పేరుతో రూ. 5 ముఖ విలువ కలిగిన 637428 షేర్లను ఒక్కొ షేరుకు రూ. 3916.42 రూ. చెల్లించి రూ. 249,64, 35768 /- కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌కి చెల్లించారు. అంటే వర్సిటీ నుండి డబ్బును తమ మరో షెల్ కంపెనీ అయిన కోయిస్ ఎడ్యుకేషన్‌కి తరలించారు. ఈ లెక్కన వర్సిటీలో వర్సిటీ విలువ నామమాత్రమే. అదే సమయంలో కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ఎల్.ఎల్.పి. రద్దు చేయబడిరది. 26-07-2023న ప్రై.లి. క్రిందకు మార్చారు.
ఒకే రుణం రెండు ప్రై.లి.కంపెనీల్లో...
వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీ 8, జూలై 2021 బజాజ్ ఫైనాన్స్, పుణె నుండి 350 కోట్ల అప్పు, 21, జూన్ 2021 హీరో ఫిన్ కార్ప్, డిల్లీ నుండి 135 కోట్ల రుణం, 14, జూన్ 2021 టాటా క్యాపిటల్, ముంబాయి నుండి 335 కోట్ల రుణం పొందినట్లు పుస్తకాల్లో చూపించారు. ఇదే అప్పు శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. పేరు మీద ఒక నెల అటుఇటుగా ఎస్.ఆర్.ఎన్. మరియు ఛార్జ్ ఐడీల మార్పుతో 820 కోట్లు రుణం తీసుకున్నట్లు చూపించారు. ప్రైవేట్ పైనాన్స్ కంపెనీ అయిన టాటా క్యాపిటల్‌లో రూ. 335 కోట్ల రుణాన్ని ఒకే నంబరు మీద అటు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. లోనూ, ఇటు శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.లోనూ చూపించారు. అలాగే ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో తీసుకున్న రుణం రూ. 150 కోట్లు శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్ పేరు మీద, రూ. 165.17 కోట్లు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ పేరు మీద తీసుకోగా ఈ రెండిరటి రుణాలను వర్సిటీలోనే చూపటం గమనార్హం. అలాగే హీరో ఫిన్ కార్ప్‌లో రూ. 135 కోట్ల రుణం శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్ పేరు మీద తీసుకుని వర్సిటీ ఎడ్యుకేషన్ బుక్స్‌లో చూపించారు. ఎన్నో రకాల అవకతవకలకు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కేంద్రబిందువుగా నిలుస్తోంది. అసలు వర్సిటీకి మేనేజ్‌మెంట్‌కి, శ్రీ వాల్మీకి మేనేజ్‌మెంట్‌కి సంబంధం ఏమిటి అంటే ఎలాంటి సంబంధం లేదు. మరి ఎందుకు శ్రీ వాల్మీకి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ చేసిన అప్పులకు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ కి సెక్యూరిటీ ప్రొవైడర్‌గా ఉంది అంటే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. శ్రీవాల్మీకి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. నిర్వాహకులు ఎవరంటే డా॥బి.ఎస్.రావు, బి. రaాన్సీ లక్ష్మీభాయి కి చెందినది. వర్సిటీ నిర్వాహకుల అమ్మా, నాన్నలదే. అందుకే అన్నీ దారులు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. వైపు మళ్ళుతున్నాయి.
శ్రీచైతన్య నిర్వాహకుల మరో షెల్ కంపెనీయే కోయిస్ ఎడ్యుకేషన్ !
అసలు కోయిస్ ఎద్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. ఏం చేస్తుంది. చిరునామా ఏంటి ? ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ సంస్థ డైరెక్టర్స్ ఎవరు ? దాని ఆదాయమార్గాలు ఏంటి ? అని ఆరా తీస్తే మరోసారి కళ్ళు బైర్లు కమ్మాయి. ప్లాట్. నెం.304, 4 వ ప్లోర్, కాశెట్టి టవర్స్, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్ ఈ చిరునామాలో ఉన్నవారందరూ వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కు చెందిన కార్యకలాపాలే జరుగుతున్నాయి. కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కి చెందిన ఉద్యోగులు లేరు, కార్యకాలాపాలు లేవు, ఆదాయమార్గాలు లేవు. డైరెక్టర్స్ మాత్రం బొప్పన సుష్మ, బొప్పన సీమ వీళ్ళిద్దరే. శ్రీచైతన్య విద్యాసంస్థల నిర్వాహకులు మరో షెల్ కంపెనీయే ఈ కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.
వర్సిటీ ఎడ్యుకేషన్ అనుబంధ సంస్థలు...
వర్సిటీకి అనుబంధ సంస్థలుగా శ్రీచైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ ప్రై.లి., ర్యాంక్‌గురు టెక్నాలజీస్ ప్రై.లి. శ్రీవిద్యా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రై.లి., అప్‌టౌన్ లైఫ్ ప్రాజెక్ట్ ప్రై.లి., చూపింది. కానీ వీటిల్లో ఒక్క ర్యాంకుగురు టెక్నాలజీస్ తప్ప మరి ఏ ఇతర సంస్థలు మనుగడలో లేవు. అంటే కార్యకలాపాలు ఉండవు, ఉద్యోగులు ఉండరు, ఆదాయమార్గాలు ఉండవు. అంతా బుక్స్‌లోనే ఉంటాయి. ఇవీ అన్నీ శ్రీచైతన్య షెల్ కంపెనీలు.
ఒక కంపెనీ నుండి మరో కంపెనీలోకి భారీగా నిధుల మళ్లింపు....
శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా అక్టోబర్ 23, 2020 వ తేదీన భారీ వర్షపాతం కారణంగా సిఎం రిలీఫ్ ఫండ్‌కి కేటీఆర్ ద్వారా రూ. కోటి రూపాయల విరాళం అందించింది. అనంతరం ఏప్రిల్ 8, 2022న బీఆర్‌ఎస్ పార్టీకి రూ. 10 కోట్లు బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీకి విరాళాలు అందించింది. వీటితో పాటు కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా జనవరి 11, 2024న తెలుగుదేశం పార్టీకి 5 కోట్లు , జనవరి 11, 2024న జనసేన పార్టీకి రూ.1 కోటి చెల్లింపులు జరిపింది. కేవలం పార్టీ ఫండ్ కోసం కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు ఈసీ రికార్డుల్లో తేలింది. శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీస్ మెనేజ్‌మెంట్ ప్రై.లి. శ్రీచైతన్య అధినేతల కనుసన్లల్లో నిర్వహించే ఒక షెల్ కంపెనీగా తేలింది. ప్రభుత్వాల నుండి ఎటువంటి చర్యలు లేకుండా పార్టీలకు ఫండ్స్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలకు ఫండ్‌లు మరియు సిఎం రిలీఫ్ ఫండ్‌ల కోసమే శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీ మేనేజమెంట్ ప్రై.లి. కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తేటతెల్లం అయ్యింది. అసలు ఎలాంటి కార్యకలాపాలు, ఆదాయమార్గాలు లేని శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెలిసిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీ రూ. 16 కోట్లు పార్టీలకు ఫండ్ ఎలా ఇవ్వగలిగింది. కంపెనీ ఆదాయ మార్గాలు ఏమిటి ? కంపెనీ ఎక్కడుంది ? ఎలాంటి సేవలు చేస్తోంది అని ఆరా తీస్తే ముంబాయిలోని ఒక ఫ్లాట్ మీద రిజిస్టర్ కాగా ఆపరేషన్ అన్నీ హైద్రాబాద్, మాదాపూర్ వేదికగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీచైతన్య సొసైటీలు/ ట్రస్ట్‌లలోని సొమ్మునే వివిధ సేవల పేరుతో శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోకి మళ్ళిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు లేకుండా గత ప్రభుత్వంలోని పార్టీలకు ఫండ్స్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.
క్విడ్‌ప్రో కో పాల్పడిన వర్సిటీ !
శ్రీచైతన్య యాజమాన్యానికి చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌కి కోకాపేటలో 296.95 కోట్ల విలువైన 7.57 ఎకరాల భూమికి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. అదే భూమికి దగ్గరలో రెండేళ్ళ లోపే ఆగష్టు 3, 2023 నాటికి నియోపోలీస్‌లో సమీపంలోని భూములను వేలం వేసింది. అప్పటికి భూముల ధర ఎకరం రూ. 100 కోట్లు పలికింది. కేవలం రెండేళ్ళ వ్యవధిలో దాదాపు ఎకరానికి 60 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదంతా 2021లో నియోపోలీస్‌లో భూవేలం ద్వారా 7.57 దక్కించుకున్న 9 నెలల తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మొత్తం రూ. 12 కోట్లు ( వర్సిటీ నుండి రూ. 2 కోట్లు) ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళం అందించింది. ఇక్కడే కోట్లాది రూపాయలు టాక్స్ బెనిఫిట్ పొందినట్లు అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి ఆక్షన్‌కి సహాకరించినందుకు గాను దాదాపు 12 కోట్లు బీఆర్‌ఎస్ పార్టీకి విరాళాలు అందించి క్విడ్ ప్రో కో పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురు సామాజిక వేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 2023 ఆగష్టు నాటికి ఆ భూమలు విలువ రూ. 100 కోట్లకు చేరింది. ఇప్పుడు నియో పోలీస్‌లో పాట్లు దక్కించుకున్న వారందరూ బీఆర్‌ఎస్ పార్టీకి విరాళాలు అందించిన వారిలో ఉండటం గమనార్హం.
0 Comments