ఇరుకు గదుల్లో వెంటిలేషన్ లేకుండా
కాలేజీ
హాస్టల్, తరగతి గదులను పరిశీలించి కాలేజీ యాజమాన్యం తీరుపై మహిళా కమిషన్
ఛైర్ పర్సన్ అసహనం వ్యక్తం చేశారు. భవనంపై నుంచి లీకేజీ నీరు కారుతూ
భోజనంలో పడిరదని విద్యార్థులు చెప్తే ఏంకాదు తినండని ఉచిత సలహా ఇస్తారా?,
పశువులను పెట్టినట్లు ఇరుకు గదుల్లో ఎలాంటి వెంటిలేషన్ లేకుండా, వాటర్
లీకేజీ ఉన్న వాష్ రూమ్స్, గదుల్లో చెత్తా చెదారం పేరుకుపోయిందని అసహనం
వ్యక్తం చేశారు. ఇలాంటి ఇరుకు గదుల్లో మీరైతే ఉంటారా? అని సిబ్బందిపై
విరుచుకుపడ్డారు. 5 ఫ్లోర్ల భవనంలోని అన్ని రూమ్ లు ఇలాగే ఉందని ఆమె
ప్రశ్నించారు. విద్యార్థినులతో పాటు సిబ్బందిని ఆరు నెలల పాటు ఈ హాస్టల్
రూమ్ లలో ఉంచితే అప్పుడు వారి ఇబ్బందులు తెలుస్తాయన్నారు. కాలేజీ
సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీచైతన్య
యాజమాన్యానికి సమన్లు పంపారు. సంబంధిత విద్యాశాఖతో పాటు, ప్రభుత్వానికి
శ్రీచైతన్య సంస్థపై చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. పిల్లల భద్రత
పై రాజీపడే ఎవ్వర్ని ఉపేక్షించేది లేదని సందర్భంగా తెలియచేశారు.
అప్రమత్తమైన శ్రీచైతన్య యాజమాన్యం !
నేరెళ్ళ శారద ఆకస్మిక తనీఖీతో శ్రీచైతన్య లోపాలు ప్రపంచానికి తెలియటంతో శ్రీచైతన్య యాజమాన్యం అప్రమత్తమైంది. దిద్దుబాటు చర్యలకు దిగింది. మాధాపూర్ హాస్టల్ క్యాంపస్‌ను ఆఘమేఘాల మీద శుభ్రంగా మార్చింది. ఇతర సౌకర్యాలను కల్పించింది. ఆహారంలోనూ నాణ్యతను పెంచినట్లు వీడియో చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఇక ప్రభుత్వం నుండి ఎలాంటి కఠినమైన చర్యలకు అధికారులు దిగకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘‘ముఖ్య’’నేతతో రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలతో ఉన్న సంబంధాలతో శ్రీచైతన్యపై ఎలాంటి చర్యలకు దిగకుండా విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుంది అనే సాకు చూపించి విషయాన్ని సాగతీసి కాలం గడిపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కష్టాల్లో అండగా ఉన్నాం
మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాం, మేము కష్టాల్లో మీరు మాట సహాయం చేయాలి అని శ్రీచైతన్య యాజమాన్యం ఏపీ ముఖ్య నేతలను సంప్రదించినట్లు సమాచారం. దీంతో రంగంలోనికి దిగిన ఏపీ ముఖ్యనేత పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీచైతన్యపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీచైతన్యపై సీజ్ చేసేటువంటి కఠిన చర్యలకు దిగకుండా ఫైన్ వేసి చేతులు దులుపుకునేందుకు అధికారులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో.
0 Comments