కోయస్ ఎడ్యుకేషన్ జగన్మాయ !
కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కి ఉద్యోగులు లేరు, కార్యకలాపాలు లేవు. అద్దెలు లేవు, ఇతర ఖర్చులు లేవు. ఒక కంపెనీ పేపరు మీదే ఉంటే రూల్స్ ప్రకారం దానిని షెల్ కంపెనీగా అభివర్ణింస్తారు. 2018 నుండి 2023 వరకు కేవలం నష్టాలను మాత్రమే చూపించిన కోయస్ ఎడ్యుకేషన్ 26`07`2023 న ప్రై.లి. కంపెనీగా మారింది. ఎప్పుడైతే ప్రై.లి. కంపెనీగా మారిందో అప్పటి నుండి వర్సిటీ ఎడ్యుకేషన్ నుండి షేర్ల బై బ్యాక్ పేరుతో కోట్లాది రూపాయలు కోయస్ ఎడ్యుకేషన్‌లోకి నిధుల వరద పారుతోంది. 19`10`2022 వ తేదీన షేర్‌ల బైబ్యాక్ పేరుతో రూ. 5 ముఖ విలువ కలిగిన 11, 08, 976 షేర్లను ఒక్కొ షేరుకు రూ. 1893.64 రూ. ప్రీమియం చెల్లించి రూ. 210 కోట్లు కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌కి చెల్లించారు. అదే విధంగా 30`09`2024 న మరోసారి షేర్‌ల బైబ్యాక్ పేరుతో రూ. 5 ముఖ విలువ కలిగిన 637428 షేర్లను ఒక్కొ షేరుకు రూ. 3916.42 రూ. ప్రీమియం చెల్లించి రూ. 249 కోట్లు కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌కి చెల్లించారు. ఈ లెక్కన కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. ఈ రోజుకి షేర్ల విలువ ఎంతో తెలుసా. రూ. 5778.9 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే షేర్ల బై బ్యాక్ పేరుతో వందలాది కోట్లను కోయస్‌కు తరలించేందుకు పక్కా ప్లాన్ ముందుగానే సిద్ధం అయ్యింది అన్నమాట. అంటే వర్సిటీ ఎడ్యుకేషన్‌లోని సొమ్మును అత్యధిక ప్రీమియం పేరుతో కోయస్‌లోకి తరలించడానికి శ్రీచైతన్య యాజమాన్యం అయిన బొప్పన సుష్మశ్రీ, బొప్పన సీమ వేసిన అద్భుతమైన పథకం అని చెప్పవచ్చు.
అనుబంధ సంస్థల నుండి వర్సిటీలోకి...వర్సిటీ నుండి కోయస్‌లోకి నిధుల మళ్ళింపు !
వర్సిటీకి అనుబంధ సంస్థలుగా శ్రీచైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ ప్రై.లి., ర్యాంక్‌గురు టెక్నాలజీస్ ప్రై.లి. శ్రీవిద్యా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రై.లి., అప్‌టౌన్ లైఫ్ ప్రాజెక్ట్ ప్రై.లి., ఇవే కాక మరెన్నో ఉమ్మడి నియంత్రణలో ఉన్న బీజేయస్ బిల్డర్స్, శ్రీవనమాలి అగ్రోఫామ్స్, శ్రీవశిష్ట ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, శ్రీ విహర్ అగ్రోటెక్, శ్రీవైభవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, శ్రీవైభవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, శ్రీవరాహ హార్టికల్చర్ వంటి ఎన్నో సంస్థల నుండి వర్సిటీలోకి నిధులు మళ్ళిస్తుండగా, వర్సిటీ నుండి నిధుల మొత్తాన్ని కోయస్‌కు తరలించేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించింది శ్రీచైతన్య యాజమాన్యం.అసలు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌కి 16502002 షేర్స్ ఉంటే మెజార్టీ వాటా 15864560 షేర్లు కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ఎల్.ఎల్.పి. అనే సంస్థకు చెందినదే. దీని నిర్వాహకులు బొప్పన సుష్మ, బొప్పన సీమ. వీరిద్దరూ వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.కి చెందిన డైరెక్టర్సే. అంటే వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.కి దాదాపు 95% వాటా కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌దే. వారి కంపెనీల్లో వారే పెట్టుబడులు పెట్టినట్టు చూపించి, వారి కంపెనీల్లో వారే షేర్లు కొనుకున్నట్లు చూపించి, వారి కంపెనీల్లోకి వారే షేర్లు అమ్ముకున్నట్లు చూపించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారు. వీటిల్లో ఒకటి రెండు సంస్థలకు తప్ప మరి ఏ ఇతర సంస్థలకు కార్యకలాపాలు ఉండవు, ఉద్యోగులు ఉండరు, ఆదాయమార్గాలు ఉండవు. అంతా బుక్స్‌లోనే ఉంటాయి. ఇవీ అన్నీ శ్రీచైతన్య యాజమాన్యంలో నడిచే షెల్ కంపెనీలు.
0 Comments