- శ్రీచైతన్య డొల్ల కంపెనీల భారీ అక్రమాలు !
- భారీ ప్రీమియంతో నిధుల మళ్ళింపు !
- ర్యాంకు గురులో అప్పులను ఆదాయంగా చూపుతున్న వైనం !
- ఒక కంపెనీకి మరో కంపెనీలో మెజారిటీ వాటాలు !
3 కోట్ల మూలధనం ఉన్న కోయస్ వేలకోట్ల కంపెనీ అయిన వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.లో 96% షేర్లను ఎలా దక్కించుకుంది. రూ. 5 /- విలువ ఉన్న ఒక్కో షేరును కేవలం 2.94 కోట్లతో 1,58,64,560 షేర్లను తన పేరిట ఎలా వ్రాయించుకోగలిగింది. అసలు ఏ లెక్కన చూసిన ఇది అసంభవం. కానీ కోయస్‌లో సాధ్యపడిరది. ఒక్కో షేరు విలువ సుమారు రూ.1.86 పైసలకే కోయస్‌కు దక్కింది. ఏ కంపెనీ అయినా నష్టానికి తన షేరు అమ్ముకుంటుందా ? సరే నష్టాన్ని వర్సిటీ ఎడ్యుకేషన్ తన లెక్కల్లో చూపిందా ? అసలు కోయస్ కథ ఏంటో తెలుసుకుందాం.
COUES మహామాయ మొదలు !
కేవలం 3 ఏళ్ళ వ్యవధిలో రూ. 5 రూపాయలు ఉన్న షేరుకు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ఒక్కో షేరుకు రూ. 1893/- పెట్టి తన షేర్లను (బై బ్యాక్) తానే కొనుక్కుంటోంది. దానికి ప్రీమియం పేరు తగలించి 2023లో 209 కోట్లు కోయస్‌కు బదాలాయించింది. అనంతరం 2024 మరో 249 కోట్లు బదాలాయించింది. ఈ సారి రూ. 5 /- ఉన్న షేరుకు 3916 /` చెల్లించింది. ఈ లెక్కన ఈ రోజుకి కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీ వాల్యు ఎంతో తెలుసా 5778 కోట్లు. ఇక ముందు వర్సిటీలోని సొమ్మును కోయస్‌లోకి తరలించేందుకు అధిక ప్రీమియం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీల వెనుక ఉండి కథ నడిపిస్తున్నది ఎవరో తెలుసా, శ్రీచైతన్య డైరెక్టర్లు బొప్పన సుష్మశ్రీ, బొప్పన సీమ. పైన పేర్కొన్న అన్ని కంపెనీలకు వీరే డైరెక్టర్లు. నిజానికి ఒకే కంపెనీలో ఈ లావాదేవీలు నిర్వహించవచ్చు. కానీ ఈ కంపెనీ నుండి ఆ కంపెనీకి, ఈ కంపెనీ నుండి ఆ కంపెనీ కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తూ షెల్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు.

అప్పులను ఆదాయంగా చూపుతున్నRANKGURU
డిబెంచర్లు అంటే ప్రజల నుండి మూలధనాన్ని సేకరించడానికి కంపెనీలు జారీ చేసే దీర్ఘకాలిక ఆర్థిక సాధనాలు. అవి భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీలో స్థిర వడ్డీ రేటుతో కంపెనీ చట్టబద్ధంగా తిరిగి చెల్లించాల్సిన ఒక రకమైన రుణం. వాటాదారుల మాదిరిగా కాకుండా, డిబెంచర్లను కలిగి ఉన్న వ్యక్తులు కంపెనీలో ఏ హోదాని కలిగి ఉండరు. బదులుగా, వారు ఇచ్చిన డబ్బును వడ్డీతో తిరిగి చెల్లిస్తామని కంపెనీ నుండి డిబెంచర్ రూపంలో వాగ్దానం కలిగి ఉంటారు. కానీ ప్రజల నుండి కాక వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీ నుండి 5 సంవత్సరాల కాలానికి గాను 250 కోట్లను డిబెంచర్ల రూపంలో ర్యాంక్‌గురు టెక్నాలజీ సొల్యుషన్ ప్రై.లి. అప్పులు సేకరించింది. 21-12-2022 నాటికి 105 కోట్లు విలువైన డిబెంచర్లు కేటాయించి వర్సిటీ నుండి అప్పు పొందింది. కానీ ఇక్కడే ఒక మతలబు ఉంది. ర్యాంక్‌గురు టెక్నాలజీస్ తన 2022-23 ఆర్థిక సంవత్సరానికి 100 కోట్ల స్ట్రాంగ్ రెవిన్యూ గ్రోత్‌తో లాభాలు సాధిస్తున్నట్లు ప్రచారం చేసుకుంది. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్థిరమైన రెవెన్యూ గ్రోత్‌తో 200 కోట్లకు పైగా కంపెనీ టర్నోవర్ ఎగబాకినట్లు తెలిపింది. ఇదంతా కేవలం రెండు సంవత్సరాల్లోనే సాధించిన ఘనతగా పేర్కొంది. ఇదంతా చూస్తుంటే ర్యాంకుగురు టెక్నాలజీ సొల్యుషన్ ప్రై.లి. ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ కంపెనీ ఆదాయాన్ని ఎక్కువగా చూపుతున్నట్లు తెలుస్తోంది.
వర్సిటీ షేర్ల సంఖ్య, విలువ పెంచకపోవడానికి కారణం !
వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి....శ్రీచైతన్య విద్యాసంస్థల ట్రస్ట్‌లు / సొసైటీలకు సంబంధించిన సొమ్మును తరలించేందుకు ఓ వాహకంగా ఉపయోగపడుతున్న సర్వీస్ ఏజెన్సీ. 2010 సంవత్సరంలో నెలకొల్పిన ఈ సంస్థ పెయిడప్ క్యాపిటల్ ఇప్పటికీ 11, 19, 97060/- మాత్రమే, షేర్లు 16502002 మాత్రమే. గత దశాబ్దకాలంగా 100 కోట్ల లాభాలతో పాటు ఫ్రీ రిజర్వ్‌ల క్రింద వందల కోట్లు పోగుపడ్డాయి. కానీ పెయిడప్ క్యాపిటల్‌ను పెంచలేదు, అదే విధంగా షేర్ల సంఖ్యను, షేర్ల విలువ (రూ.5)ను పెంచలేదు. ఉదాహరణకు శ్రీచైతన్య యాజమాన్యం చేతిలో ఉన్న షెల్ కంపెనీలైన శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రై.లి మరియు అప్‌టౌన్ లైఫ్ ప్రాజెక్ట్ ప్రై.లి. కంపెనీల్లోకి 19-06-2021 నుండి 10-07-2023 కేవలం 2 ఏళ్ళ వ్యవధిలో లక్ష రూపాయలు ఉన్న కంపెనీ ఆథరైజ్డ్ క్యాపిటల్‌ను 4 దశల్లో పెంచుకుంటూ పోయింది. కంపెనీ ఆథరైడ్జ్ క్యాపిటల్ రూ. 600 కోట్లకు చేరింది. ఈ రెండు కంపెనీల్లో ఆథరైడ్జ్ క్యాపిటల్ పెరగటం ఒకేసారి జరిగింది. కానీ ఈ రెండు కంపెనీలకు నిధులు సమకూర్చింది మాత్రం వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. అప్పుల రూపంలో శ్రీవిద్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రై.లి. లోకి రూ. 600 కోట్లు తరలించి ఒక్కోషేరుకు రూ. 10 ముఖ విలువతో 60 కోట్ల షేర్లను విడుదల చేసింది. ఆ షేర్లలో మెజార్టీ భాగం వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ పొందింది. అలాగే అప్‌టౌన్ లైఫ్ ప్రాజెక్ట్ ప్రై.లి. కంపెనీలోకి మరో రూ. 600 కోట్లు తరలించి ఒక్కోషేరుకు రూ. 10 ముఖ విలువతో 60 కోట్ల షేర్లను విడుదల చేసింది. ఆ షేర్లలో మెజార్టీ భాగం వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ దక్కించుకుంది. ఇక్కడ ఒక విషయం గమనిస్తే వర్సిటీ పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో 10000 ఉన్న షేర్లు ఏకంగా 60 కోట్ల షేర్లకు చేరగా, ఎన్నో వందల కోట్లు ఉన్న వర్సిటీ తన పెయిడప్ క్యాపిటల్‌ను ఎందుకు పెంచలేక పోతుంది. షేర్ల సంఖ్యను, షేర్ల ముఖ విలువను ఎందుకు పెంచలేకపోతుంది అపూ అంశంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి వర్సిటీ తన నల్లడబ్బును అధికారికంగా ఇతర షెల్ కంపెనీకు చేరవేస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక ప్రై.లి. కంపెనీలో మరో ప్రై.లి. కంపెనీకి మెజారిటీ వాటాలు !
శ్రీచైతన్య యాజమాన్యం ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రై.లి. కంపెనీల పేరు మీద షెల్ కంపెనీలు నెలకొల్పింది. అవసరాన్ని బట్టి కొన్ని కంపెనీల్లో అప్పుల రూపంలో వందల కోట్లు తరలించి ఆయా కంపెనీల షేర్లను వర్సిటీకి చెంది ఉండేటట్లు చూసుకుంటుంది. కానీ ఆయా సంస్థల్లో సంస్థాగత కార్యకలాపాలు నడవవు. ఉద్యోగులు ఉండరు, అన్నీ కాగితాల మీదే ఉన్నట్లు నడిపిస్తారు. ఏ ప్రై.లి. కంపెనీలో అయినా భాగస్వాములు, వాటాదారులు మాత్రమే ఉంటారు. కానీ శ్రీచైతన్య యాజమాన్యం నిర్వహించే ప్రై.లి. కంపెనీల్లో మాత్రం మరో ప్రై.లి. కంపెనీ భాగస్వామిగా ఉంటుంది. లిస్టెడ్ కంపెనీల్లో అయినా పెట్టుబడులు పెడుతున్నారా అంటే అదీ లేదు. అనామక, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుండటం గమనార్హం. ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను షెల్ కంపెనీలుగా నిర్థారించటం జరిగింది. ఒక ప్రై.లి. కంపెనీలో మరో ప్రై.లి. కంపెనీలో మెజారిటీ వాటాలు కలిగి ఉండటం ఇది చట్టవిరుద్ధం. అంటే సదరు యాజమాన్యం తనకు చెందిన మరో ప్రై.లి. కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది అంటే ఆ యాజమాన్యం దురుద్ధేశ్యం ఏమిటో ఇట్టే అర్థం అయిపోతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడే కంపెనీలను షెల్ కంపెనీలుగా పేర్కొంటూ పీఎంఓ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రై.లి. కంపెనీల్లో భాగస్వాములు, వాటాదారులు మాత్రమే ఉండాల్సి ఉండగా, ఆ స్థానంలో కంపెనీలు రావటంతో త్వరలో కేంద్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించబోతోంది.
0 Comments