
రాజకీయ పార్టీలకు భారీ విరాళం !
SRI CHAITANYA STUDENT FACILITY MANAGEMENT PVT LTD ఏప్రిల్ 8, 2022న బీఆర్‌ఎస్ పార్టీకి రూ. 10 కోట్లు , శ్రీచైతన్య మరో కంపెనీ అయిన VARSITY EDUCATION MANAGEMENT PVT LTD పేరు మీద బీఆర్‌ఎస్ పార్టీకి మరో రూ. 2 కోట్లు మొత్తం రూ. 12 కోట్లు బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీకి విరాళాలు అందించింది. వీటితో పాటు జనవరి 11, 2024న తెలుగుదేశం పార్టీకి 5 కోట్లు , జనవరి 11, 2024న జనసేన పార్టీకి రూ.1 కోటి చెల్లింపులు జరిపింది. కేవలం పార్టీ ఫండ్ కోసం కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు ఈసీ రికార్డుల్లో తేలింది. అద్దె చెల్లింపుల కోసం ఓనర్లను ఇబ్బందులకు గురి చేసే శ్రీచైతన్య యాజమాన్యం తన కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చుతుంది. ప్రభుత్వంలోని పెద్దల అండతో అధికారులపై వత్తిడి పెంచి శ్రీచైతన్య సంస్థల్లో జరిగే లోపాలు, అవకతవలపై నోరెత్తకుండా ఈ విరాళాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
బిల్డింగ్ అద్దెలు చెల్లించకుండా యజమానులకు ఇబ్బందులు !
మరో వైపు SRI CHAITANYA STUDENT FACILITY MANAGEMENT PVT LTD శ్రీచైతన్య అద్దెకు తీసుకున్న భవనాలకు రెంట్ చెల్లించకుండా యజమానులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...విజయవాడ, గూడవల్లిలోని సర్వే నెంబరు : 183/ 212 లోని స్థలంలోని బిల్డింగ్‌కి రూ. 2,60,20,843/- అద్దె చెల్లించని కారణంగా ఆ బిల్డింగ్ యజమాని కె. రామ మోహన రావు ఏకంగా శ్రీచైతన్య యాజమాన్యంపై దివాలా పరిష్కార ప్రక్రియకు దిగారు. దీనికోసం ముంబాయిలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను సంప్రదించారు. దీంతో దిగి వచ్చిన యాజమాన్యం ఇవ్వవలసిన అద్దె బకాయిలను చెల్లించి 11 జూలై 2023న సెటిల్‌మెంట్ చేసుకుంది. చట్టపరంగా దివాలా వేటును తప్పించుకుంది. కానీ ఎక్కడాSRI CHAITANYA STUDENT FACILITY MANAGEMENT PVT LTD తన కంపెనీ ఆబ్జక్ట్‌లో చూపిన విధంగా హోటల్స్ కానీ, మోటెల్స్ కానీ ఎక్కడా నిర్వహించటం లేదు. శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన హాస్టల్స్ నిర్వహణను శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెలిసిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. తన కార్యకలాపాలుగా చూపుతూ శ్రీచైతన్య విద్యాసంస్థల సొసైటీలలోని డబ్బును ఈ కంపెనీలోకి తరలిస్తోంది. శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెలిసిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై.లి నుండి షేర్‌ల రూపంలో వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీకి తరలిస్తోంది. శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెలిసిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై.లి కంపెనీకి రోజు వారీ కార్యకలాపాలు లేవు, 02-06-2021 నాటికి 367,68,30,000 కోట్లు కంపెనీ రిజర్వ్ క్రింద చూపింది. ఆ రిజర్వ్‌లు ఎలా వచ్చాయి , ఏ వ్యాపారం మీద అంత లాభం వచ్చింది. అన్నింటినీ మించి రాజకీయ పార్టీలకు ఇన్ని కోట్లు విరాళాలుగా ఎలా ప్రకటిస్తోంది అని మిలియన్ డాలర్ల ప్రశ్న. శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెలిసిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై.లి తన చిరునామాగా చూపిన ప్లాట్ నెం. 80, శ్రీ సాయి ప్లాజా, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌లో వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.కు చెందిన కార్యకలాపాలే నడుస్తున్నాయి.
0 Comments