- రూ. 3 కోట్ల రూపాయల కంపెనీలో వందలు, వేల కోట్లు కంపెనీలు విలీనం !
- ఆపై ప్రైవేటు కంపెనీని ఎల్‌ఎల్‌పిగా మార్పు !
- వెనువెంటనే కంపెనీ రద్దు !
ఇప్పటికే రూ. 230 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడి పీకల్లోతు కష్టాల్లో ఉన్న శ్రీచైతన్యకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని వాటితో దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో వందల కోట్ల రూపాయల ఆస్తులను శ్రీచైతన్య కళాశాలల యాజమాన్యం కొనుగోలు చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇదంతా అనధికార డబ్బు. ఏ లెక్కల్లో చూపని డబ్బు. ఇందుకోసం రెండు సాఫ్టేవేర్లను ప్రత్యేకంగా తయారు చేయించుకుంది శ్రీచైతన్య. ట్యాక్స్ చెల్లించేందుకు ఒక సాఫ్టేవేర్‌ను, ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకై మరొక సాఫ్ట్‌వేర్‌ను శ్రీ చైతన్య కాలేజ్ ఏర్పాటు చేసుకున్నట్లు ఐటీ సోదాల్లో బయటపడిరది. కానీ ఇప్పుడు బహిర్గతమైన సరికొత్త విషయం ఏమిటంటే శ్రీచైతన్య షెల్ కంపెనీలతో చేస్తున్న అక్రమాలు, అరాచకాలను వెలుగులోకి తీసువచ్చింది ప్రజాస్వామ్యం.
పె...ద్ద కంపెనీలను చిన్న కంపెనీల్లో విలీనం ! ఆపై రద్దు !
కేవలం మూడంటే మూడే కోట్లు ఉన్న COEUS EDUCATION MANAGEMENT PVT LTD కంపెనీ రూ. 1970 కోట్ల ఆస్తులు ఉన్న VARSITY EDUCATION మేనేజ్‌మెంట్ ప్రై.లి. ఎలా మింగేసింది ? అలాగే శ్రీచైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ ప్రై.లి. ఆస్తుల లెక్క ఎంతో తెలియకపోయినా కేవలం రిజర్వ్‌ల క్రిందే 367 కోట్లు ఉన్న కంపెనీని కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీ ఎలా విలీనం చేసుకుంది ? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మేధావి వర్గాలను ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. అనంతరం కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీని COEUS EDUCATION L.L.P గా మార్చటం, ఆపై వెంటనే ఆ కంపెనీ రద్దు చేయటం వంటి అంశాలు చకాచకా జరిగిపోయాయి. మార్చి 31, 2024 నాటికి వర్సిటీ ఎద్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి కంపెనీకి రూ. 1970 కోట్లు ఆస్తులు ఉన్నట్లు వర్సిటీ యాజమాన్యమే తన ఆస్తులు & అప్పుల ఖాతాలో చూపింది. అలాగే శ్రీచైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోయిన 02-06-2021 నాటికి 367 కోట్లు రిజర్వ్‌ల క్రింద ఉన్నట్లు చూపింది. దీనికి పూర్తిగా సాక్ష్యాలు ఉన్నాయి. ఇకపోతే వర్సిటీ ఎడ్యుకేషన్, శ్రీచైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ, కోయస్ ఎడ్యుకేషన్ ఈ 3 కంపెనీల ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్‌ను (రూ. 28, 31,00,000) కలిపి రూ. 10 రూ. ముఖవిలువ కలిగిన 2, 83,10,000 షేర్లను విడుదల చేసింది. మరి వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌కి చెందిన వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి ? శ్రీచైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీలోకి కోట్లాది రూపాయలు ఎక్కడికి చేరాయి ? ప్రీమియం పేరుతో కోయస్‌కు తరలించిన 450 కోట్లు పరిస్థితి ఏంటి ? అనేది ఎవరికి అంతు చిక్కటం లేదు. ఇంతకు ముందు కోయస్‌లో ఉన్న కొంత సొమ్ము వర్సిటీ ఎద్యుకేషన్ కంపెనీ అకౌంట్ నుండి యాక్సిస్ బ్యాంక్ ఎస్.ఆర్.నగర్ శాఖ లోని బొప్పన సుష్మ, బొప్పన సీమకు చెందిన వ్యక్తిగత ఖాతాలకు మళ్ళించినట్లు సాక్ష్యాలు ఉన్నాయి.
అక్షరాలు మార్పుతో మళ్ళీ అదే కంపెనీ కొనసాగింపు !
గత 15 సంవత్సరాలుగా వేల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీ అక్రమాలకు పాల్పడిరదా ? అందుకే దానిని శ్రీచైతన్య యాజమాన్యం కోయస్ అనే మరో కంపెనీలో విలీనం చేసిందా ? మళ్ళీ అదే పేరుతో వర్సిటీ సౌత్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. మరియు వర్సిటీ ఎడ్యుఫికేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. పేరుతోనే మళ్ళీ కొత్త కంపెనీలు ప్రారంభించటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. లేదంటే ఇంత సడన్‌గా కంపెనీల రద్దు చేయటం వెనుక మతలబు ఏంటి ? కథా కమామీషు ఏమిటంటే...కంపెనీ షేర్ల పేరుతో చేస్తున్న అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి, ఆదాయపు పన్ను శాఖ నుండి తప్పించుకోవడానికి ఈ కంపెనీల రద్దు చర్యలకు పాల్పడుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధారాలను ధ్వంసం చేసే ప్రక్రియ వేగంగా చేపట్టినట్టు తెలుస్తోంది.
0 Comments