- పన్ను ఎగవేతకు కొత్త సాప్ట్‌వేర్ !
- కనిపించకుండా పోయిన డైరెక్టర్లు !
- అధారాలు సేకరించే పనిలో దర్యాప్తు అధికారులు !
ప్రముఖ విద్యాసంస్థ శ్రీ చైతన్య కాలేజీలపై దేశవ్యాప్తంగా ఐటి సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢల్లీి, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలలోనూ ఐటీ శాఖ బృందాలు శ్రీ చైతన్య కాలేజీలపై సోదాలు చేపట్టాయి. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో భారీగా నగదు తీసుకోవడం, పన్ను ఎగవేత చేస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ప్రతి బ్రాంచీలోనూ విద్యార్థుల అడ్మిషన్ల కొరకు వారి ఫీజుల చెల్లింపుల కొరకు ప్రత్యేకంగా తయారు చేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా లావాదేవీలు నిర్వహించడమే కాకుండా, మరో సాఫ్ట్‌వేర్ ద్వారా టాక్స్ చెల్లింపులనూ తప్పించుకుంటునట్లు తెలుస్తోంది. ఇక ఆయా బ్రాంచ్‌ల నుండి భారీగా నగదు చెల్లింపులు జరిగేలా స్కూల్స్, కాలేజీ ప్రిన్సిపాల్స్‌ను ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా చెల్లించిన నగదును మాత్రమే ఐటీలో చూపే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి గాను ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కొరకు మరొక సాప్ట్‌వేర్‌ను తయారు చేసుకుని ఆన్‌లైన్ లావాదేవీలను మాత్రమే చూపి నగదు రూపంలో వసూలు చేసిన సొమ్ముకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించటం లేదని వెలుగులోకి వచ్చింది. ఇలా లెక్కల్లో చూపని నగదును ఇతర కంపెనీల్లోకి తరలించినట్లు తెలుస్తోంది. సోదాలు చేపట్టిన ఐటీ శాఖ అధికారులు ఈ వివాదంలో ఉన్న పన్ను చెల్లింపుల్ని, వ్యవహారాల్ని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అన్నీ బ్రాంచీల్లో ఇదే తంతు !
దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్రాంచీల్లో ఇదే తరహాలో వ్యవహరాలను నడిపిస్తూ కోట్లాది రూపాయల నగదును లెక్కల్లోకి చూపకుండా కొట్లాది రూపాయలు పన్ను ఎగవేతకు పాల్పడుతోంది శ్రీచైతన్య యాజమాన్యం. ఇదే తరహా మోసాన్ని గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో టాక్స్ ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి వందల కోట్లలోనే పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది. టాక్స్ ఎగవేత కోసం ప్రత్యేకంగా సాప్ట్‌వేర్‌ను రూపొందించారు అంటే ఎంత ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌ను నిర్వహిస్తున్నారో అర్థం అవుతోంది. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగించిన సాఫ్ట్ వేర్ లను పరిశీలించారు. శ్రీ చైతన్య కాలేజీలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను వెరిఫై చేస్తున్నారు ఐటీ అధికారులు. శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన గత ఐదు సంవత్సరాల ఐటీ చెల్లింపుల వివరాల ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు యాప్‌ల ద్వారా స్టూడెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేసినట్టు గుర్తించారు. దీంతో ఫీజుల చెల్లింపులకు రెండు యాప్‌లు ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. మొత్తం శ్రీచైతన్య విద్యాసంస్థలకు ఎన్ని బ్రాంచిలు ఉన్నాయి? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్ పేమెంట్ చేశారు? ఎంత మంది నగదురూపంలో చెల్లించారు అనే వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
అతిపెద్ద కార్పొరేట్ ప్రాడ్ !
కార్పొరేట్ లాబీయింగ్‌తో ప్రభుత్వ వ్యవస్థలను చెరబట్టి వారు ఆడిరదే ఆటగా, పాడిరదే పాటగా చెలామణి అవుతుందనే ధైర్యంతోనే ఆదాయపు పన్ను ఎగవేత కోసం కొత్తగా సాప్ట్‌వేర్‌ను తయారు చేసుకోవటం కొసమెరుపు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, తమ పన్ను చెల్లింపులను మరొక విధంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. పన్నుల బకాయిలను సాఫ్ట్‌వేర్ ద్వారా సులభంగా దాచడానికి మార్పులు చేసేందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగించారని అంటున్నారు. పన్ను ఎగవేతకు దారులు వెతికే వారికి శ్రీచైతన్య ఒక మార్గదర్శిగా నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చర్యతో ప్రభుత్వాలు అన్నా, వ్యవస్థలు అన్న లెక్కలేని తనం సుస్పస్టం అవుతోంది. అక్రమ లావాదేవీతో ఆదాయపు పన్ను శాఖను మోసం చేస్తున్న శ్రీచైతన్య దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఫ్రాడ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ప్రతి రూపాయికి ఆన్‌లైన్ పేమెంట్ రశీదు
తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజలు చెల్లించేటప్పుడు నగదు చెల్లింపులు మినహాయించి ఆన్‌లైన్ చెల్లింపులు జరిపితేనే శ్రీచైతన్య లాంటి సంస్థల ఆగడాలు ఆగుతాయిని లేకుండా మళ్ళీ మళ్ళీ ఇదే తంతు జరుగుతూనే ఉంటుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు.
అందుబాటులో లేని డైరెక్టర్లు !
శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బొప్పన సత్యనారాయణ రావు, ఆయన కుటుంబసభ్యుల నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఆయన కుమార్తెలైన బొప్పన సుష్మ, బొప్పన సీమ ఇళ్లలో కూడా ప్రత్యేక దర్యాప్తు జరుగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32, రోడ్ నెంబర్ 10లో ఉన్న బొప్పన సుష్మ, బొప్పన సీమ నివాసాల్లో ఐటీ అధికారులు నిన్నటి నుంచి మరింత తీవ్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, సోదాల సమయంలో ఇద్దరు డైరెక్టర్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. వారిరివురు వచ్చిన తర్వాత ఐటీ శాఖ మరోసారి వారి నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశముందని సమాచారం. విద్యా సంస్థల ద్వారా ఆదాయపు పన్ను మోసం చేసి, ఆ నిధులను మరొకచోటికి మళ్లించారని అనుమానం నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి ఆస్తులపై మరిన్ని దర్యాప్తులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
0 Comments