అసలు ఏం జరిగింది అంటే ?
శ్రీచైతన్య యాజమాన్యం వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. కంపెనీ యొక్క మొత్తం షేర్లను కేవలం మూడంటే మూడు కోట్లు ఉన్న తన షెల్ కంపెనీ అయిన కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. రూ. 5 రూపాయల విలువ ఉన్న షేరును కేవలం రూ. 1.86 పైసలకే కట్టబెట్టింది. దీని కథ ఏమిటంటే...2018 నుండి 2023 వరకు కేవలం నష్టాలను మాత్రమే చూపించిన కోయస్ ఎడ్యుకేషన్ 26`07`2023 న ప్రై.లి. కంపెనీగా మారింది. ఎప్పుడైతే ప్రై.లి. కంపెనీగా మారిందో అప్పటి నుండి వర్సిటీ ఎడ్యుకేషన్ నుండి షేర్ల బై బ్యాక్ పేరుతో కోట్లాది రూపాయలు కోయస్ ఎడ్యుకేషన్‌లోకి నిధుల వరద పారింది. 19`10`2022 వ తేదీన షేర్‌ల బైబ్యాక్ పేరుతో రూ. 5 ముఖ విలువ కలిగిన 11, 08, 976 షేర్లను ఒక్కొ షేరుకు రూ. 1893.64 రూ. ప్రీమియం చెల్లించి రూ. 210 కోట్లు కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌కి చెల్లించారు. అదే విధంగా 30`09`2024 న మరోసారి షేర్‌ల బైబ్యాక్ పేరుతో రూ. 5 ముఖ విలువ కలిగిన 637428 షేర్లను ఒక్కొ షేరుకు రూ. 3916.42 రూ. ప్రీమియం చెల్లించి రూ. 249 కోట్లు కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌కి చెల్లించారు. ఈ లెక్కన కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. షేర్ల విలువ ఎంతో తెలుసా. రూ. 5778.9 కోట్లు. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. వేసిన ప్లాన్‌ను బయటకు పొక్కటంతో భయపడిన శ్రీచైతన్య యాజమాన్యం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ విషయాన్ని సంవత్సర కాలంగా ప్రజాస్వామ్యం పత్రిక వెలుగులోకి తీసుకరావటంతో షెల్ కంపెనీల బండారం ఎక్కడ బయటకు వస్తుందో అనే భయంతో మొత్తం కంపెనీలను ఒక దానిలో మరొకటి విలీనం చేసుకొచ్చింది. చివరికి కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి.ను ఎల్.ఎల్.పి.గా మార్చి మూసివేసింది. ఈ తతంగం అంతా కేవలం 3 నెలల వ్యవధిలోనే యుద్ధప్రాతిపదికన శరవేగంగా పూర్తిచేసి కంపెనీలను విజయవంతంగా మూసివేసింది.
కోయస్‌లోకి వచ్చిన కోట్ల ఆస్తులు ఏం అయినట్టు ?
కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌లోకి వచ్చిన కోట్లాది రూపాయలు ఏం అయినట్లు ? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అనేది అంతుచిక్కని రహస్యంగా మారింది. షేర్ల బై బ్యాక్ పేరుతో కోయస్‌లోకి వచ్చిన సొమ్ము అంతా శ్రీచైతన్య సిస్టర్స్ సొంత అకౌంట్లలోకి మళ్ళించినట్లు రికార్డులు చెప్తున్నాయి. అంతే కాకుండా కంపెనీ షేర్ల పేరుతో చేస్తున్న అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి, ఆదాయపు పన్ను శాఖ నుండి తప్పించుకోవడానికి ఈ కంపెనీల రద్దు చర్యలకు పాల్పడుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే వర్సిటీ ఎడ్యుకేషన్, శ్రీచైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ, కోయస్ ఎడ్యుకేషన్ ఈ 3 కంపెనీల ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్‌ను (రూ. 28, 31,00,000) కలిపి రూ. 10 రూ. ముఖవిలువ కలిగిన 2, 83,10,000 షేర్లను విడుదల చేసింది.
ఉద్యోగుల్లో ఆందోళన ?
వర్సిటీ పేరు ఇప్పటికే అందరికి తెలియటంతో ఆ పేరుతోనే కంపెనీ కార్యకలాపాలు కొనసాగించేందుకు శ్రీచైతన్య యాజమాన్యం ముందుగానే రెండు డమ్మీ పేర్లతో కంపెనీలను రిజిస్టర్ చేసిపెట్టుకుంది. వర్సిటీ సౌత్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. మరియు వర్సిటీ ఎడ్యుఫికేషన్ మేనేజ్‌మెంట్ ప్రై.లి. పేరుతో మళ్ళీ కొత్త కంపెనీలను ఏఫ్రిల్ 1, 2025 నుండి అధికారికంగా కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిసింది. వర్సిటీ ఎడ్యుకేషన్‌ను ఆఘమేఘాల మీద మూసివేయటం ఎందుకు మళ్ళీ అదే పేరు మీద వర్సిటీ సౌత్, వర్సిటీ ఎడ్యుఫికేషన్ ఎందుకు ప్రారంభించటం అంటూ శ్రీచైతన్య ఉద్యోగుల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మళ్ళీ కొత్త కంపెనీలో సేవలు చేసినట్టు అవుతుందని పలువురు వాపోతున్నారు. శ్రీచైతన్య యాజమాన్యం చేసే తప్పులకు ఉద్యోగులు ఇబ్బందులకు గురి కావల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎవరైనా ఉద్యోగులు లోన్‌కి వెళితే కనీసం 3 నెలల పే స్లిప్‌లు అడుగుతుండటంతో పలువురు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
0 Comments